CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంతకాల సేకరణ:

Share it:


మన్యం టివి తాడ్వాయి:

ఎమ్మెల్యే సీతక్క  ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రములో  ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేఖ బిల్లుపై రైతుల సంతకాల సేకరణ*

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి

 ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో  కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ బిల్లుని నిరసిస్తూ రైతుల సంతకాల సేకరణ 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి  మాట్లాడుతూ 

      కేంద్ర ప్రభుత్వం రైతులు ఆరుగాలం పండించిన పంటకు గరిష్ట, కనిష్ట ధరలు నిర్ణయించకుండా వారికీ ఇష్టమున్న ధరకే రైతులు అమ్ముకోవాలని పార్లమెంటులో బిల్లు ఆమోదించడం వలన దళారుల చేతిలో రైతు నష్టపోయే అవకాశం ఉన్నందున వెంటనే రైతు వ్యతిరేఖ బిల్లును తొలగించాలని రైతులకు న్యాయం చేకూరాలని రైతు వ్యతిరేఖ బిల్లుకు నిరసనగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని అన్నారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ సూచించారు. రైతు దేశానికి వెన్నుముక అని చట్ట సభలలో చట్టాలు కానీ, సవరణలు కానీ రైతుకు అనుకూలంగా ఉండాలి కానీ రైతు నడ్డి విరిచి దళారులకు దోచిపెట్టేలా ఉండకూడదని వాపోయారు. 

     అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంట రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రెండో సారి గద్దెనెక్కిన తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు పంట రుణమాఫీ చేయలేదని, అలాగే పట్టా పాస్ బుక్కులు ఇవ్వకుండా రైతులని మీసేవ ,ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ రైతులను చిందర, వందర, గందర గోళం చేస్తున్నాయని వాపోయారు. అలాగే రైతు పెట్టుబడుల కొరకై రైతు బంధు ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన ఇంతవరకు రైతు పంట రుణమాఫీ కాకపోయేసరికి వచ్చిన డబ్బులు వడ్డీలుగా బ్యాంకు వారే తీసుకుంటున్నారని రైతుకు ఎటువంటి లాభం లేదని అన్నారు. కావున రైతుల పంట కొనుగోలు సమయంలో క్వింటాకు 5 నుండి 10 కిలోల వరకు మిల్లర్లు కోత విధించి రైతుకు ఇంకా అన్యాయం చేస్తున్నారు తప్ప రైతును లాభం కలగడంలేదని అన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేఖ విధి, విధానాలను ఖండిస్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఆదేశాల మేరకు రైతుల సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు యాదవ్,నాగరాజు,రవి

ఐలు కొమురయ్య,మొగిలి,రాజు

అశోక్,రమేష్,బిరయ్య,కుమారస్వామి,శ్రీనివాస్,కిరణ్,చంద్రయ్య,రాజు

వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: