*బోటిగూడెం బీటీ రోడ్డు పనుల పరిశీలన
*సర్పంచ్ సుధాకర్, సోసిటీ డైరెక్టర్ కొండేరు రాము
మన్యం టీవి, పినపాక:పినపాక అభివృద్ధి ప్రదాత విప్ రేగా కాంతారావు అని సీతంపేట సర్పంచ్ సోంబోయిన సుధాకర్,టీఆర్ఏస్ పార్టీ మండల నాయకులు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము అన్నారు. మంగళవారం పినపాక మండలంలోని బోటిగూడెం నుండి సీతారాంపురం ఎస్సి కాలనీ వరకు ఏమ్మెల్యే నిధుల నుండి రూ. 64 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న బీ టీ రోడ్డు పనులకు పరిశీలించారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు చేసిన విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: