CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హైదరాబాద్ కు బీజేపీ ఎం ఇచ్చిందో చెప్పాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Share it:


బెంగుళూరు నుండి వచ్చిన ఒక నేత ఎం చేంజ్ అయ్యింది అని రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్ నగరం గత ఆరేళ్లలో ఎంతో చేంజ్ అయ్యింది.. దేశంలోని ఇతర నగరాలకు దీటుగా హైదరాబాద్ లో మౌళిక సదుపాయాలు ఉన్నాయి. దేశంలోనే అన్ని నగరాలను మించి అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నది..


టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను ఇప్పటికే ఛేంజ్ చేసింది: ఎమ్మెల్సీ కవిత


జిహెచ్ఎం ఎన్నికలు రాగానే, ఇతర రాష్ట్రాల నుండి కొందరు నాయకులు టూరిస్టుల్లాగ వచ్చి ఇష్టమున్నట్లు మాట్లాడుతారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. “బెంగుళూరు నుండి వచ్చిన ఒక యువనేత బాధ్యతగా మాట్లాడకుండా, He wants to Change Hyderabad, Change Telangana, Change South India అని మాట్లాడుతున్నడు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరబాద్ లో సమూల మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని కళ్లు తెరచి చూడాలని ఆ యవనేతకు” ఎమ్మెల్సీ కవిత చురకలు అంటించారు. ఇవ్వాళ హైదరాబాద్ కు వచ్చిన బీజేవైం  యువమోర్చా జాతీయ అధ్యక్షులు, తేజస్వి సూర్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన విషయం తెలిసిందే.


గత ఆరేండ్లలో హైదరాబాద్ లో 24 గంటల కరెంటు, మంచి నీరు అందిస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత..దేశంలోని ఇతర నగరాలకు దీటుగా హైదరాబాద్ లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే అన్ని నగరాలను మించి అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ ఆకర్షించిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. హైదరాబాద్ లో అమెజాన్ లాంటి కంపెనీ 20వేల  కోట్ల పెట్టుబడులు పెట్టడం, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే సాధ్యమైందన్నారు. ఇవన్నీ మాట్లాడకుండా, బెంగుళూరు నుండి వచ్చిన ఓ నేత, ఎప్పుడో జరిగిన రజాకార్ల గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. బీజేపీ హైదరాబాద్ కు ఏం ఇచ్చింది, ఏం ఇవ్వనుంది అనే అంశాలపై మాట్లాడకుండా, బీజేపీ నాయకులు అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ నేతలు మాట్లాడే మాటలకు యువత ఆవేశాలను లోను కావొద్దని, కేవలం డెవలప్ మెంట్ గురించే ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: