CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే ఐశ్వర్య మృతి

Share it:



 *రాహుల్ గాంధీ ఆదేశాలతో ఐశ్వర్య కుటుంబానికి కాంగ్రేస్ ప్రగాఢ సానుభూతి


 *వీర్లపల్లి శంకర్ ఔదార్యం.. ఒక లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయం


 షాద్‌నగర్ కు పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి, సంపత్, బలమూర్ వెంకట్ ల రాక 


 మన్యం టీవి,హైదరాబాద్: ఢిల్లీ శ్రీరామ్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఐశ్వర్య రెడ్డి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎఐసిసి మాజీ నేత రాహుల్ గాంధీ ఆదేశాలతో స్పందించిన ఎఐసిసి కార్యదర్శులు చల్లా వంశీచంద్ రెడ్డి, సంపత్, కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్, స్థానిక నేత వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ కు చెందిన ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని సోమవారం సాయంత్రం వారు పరామర్శించారు ఏఐసిసి మాజీ నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఐశ్వర్య రెడ్డి  తండ్రి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని వాళ్లు కలుసుకున్నారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా స్థానిక నేత వీర్లపల్లి శంకర్ తక్షణ సహాయం కింద ఒక లక్ష రూపాయలు అందజేశారు అదేవిధంగా ఐశ్వర్య రెడ్డి సోదరి వైష్ణవి చదువులకు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని ప్రకటించారు.ఈ సందర్భంగా వారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున ఐశ్వర్య కుటుంబానికి అండగా ఉండి వైష్ణవి చదువు బాధ్యత చేసుకుంటామని, ఉన్నత చదువులు చదివిస్తామని అన్నారు. ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం అని అన్నారు. ఇన్స్పైర్ స్కాలర్ షిప్స్ రానందుకే సూసైడ్ నోట్లో రాసి ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న స్కాలర్ షిప్ లను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర  ప్రభుత్వానికి పార్టీ కార్యకలాపాలకు డబ్బులు ఉంటాయనీ, ఇలాంటి చదువుల తల్లులకు నిధులు కేటాయించక పోవడం ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నట్టు తెలిపారు అగ్ర కులస్తులలో కూడా పేదవారు ఉంటే స్కాలర్ షిప్ లో కేటాయించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వల్లే పేద విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యావిధానం ద్వారా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, ఢిల్లీలో చదువుతున్న ప్రతి ఒక్క రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్, నోట్ల రద్దు లాంటి అనాలోచిత మైన విధానాలతోనే పేద ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశారని దానికి ఉదాహరణ ఐశ్వర్య రెడ్డి కుటుంబం అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాబర్ ఖాన్, పురుషోత్తం రెడ్డి, బాల రాజు గౌడ్, సుదర్శన్ గౌడ్, కుమార్ గౌడ్, కోట్ల శ్రీశైలం, కర్రోళ్ల సురేందర్, జితేందర్ రెడ్డి, ముబారక్, ఖదీర్, అందే మోహన్, సీతారాం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: