CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను ఐక్యం చేసి హక్కుల కోసం పోరాడుతాం:యర్రగాని కృష్ణయ్య

Share it:


మన్యం టీవీ మణుగూరు:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని

సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను ఐక్యం చేసి హక్కుల కోసం  పోరాటం చేస్తామని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం(ఎస్సికెఎస్-సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య అన్నారు.సీఐటీయూ శ్రామిక భవన్ నందు తులసి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం బ్రాంచి 4 వ మహసభ లో యర్రగాని కృష్ణయ్య మాట్లాడుతూ,

కోల్ ఇండియా వేతనాలు, సమాన పనికి - సమాన వేతనం అమలు,లాభాల బోనస్,సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు,కాంట్రాక్ట్ కార్మికులతో సహ కుటుంబంలో అందరికీ కార్పొరేట్ వైద్యం,సింగరేణి క్వార్టర్,కార్మికుల చనిపోతే కోల్ ఇండియా సర్కులర్ ప్రకారం 15 లక్షలు అమలు  , జీతం చీట్టిలు,ప్రతి సంవత్సరం సీఎంపిఎఫ్ లెక్కలు,సీఎంపిఎఫ్ చీట్టిల కోసం,స్థానిక సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు.ఈ పోరాటం లోకి కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మహసభలో సీఐటీయూ జిల్లా నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు,బండిరాజేష్ ,ఉప్పుతల నర్సింహరావు,  ముత్తారావు,వెంకట,రమణ,రవి,శంకర్,వెంకటేశ్వర్లు, శ్రీవారి,తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: