CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్చవద్దని రైతుల ఆందోళన అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ నిరుద్యోగులకే ఇవ్వాలి

Share it:



మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండలంలోని బోరు నర్సాపురంలో పీఎస్ఎస్పీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని మార్చవద్దని డిమాండ్ చేస్తూ మండలంలోని బోరునర్సాపురంకు చెందిన రైతులు బోరునర్సాపురంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, మహిళా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం వరకు బోరునర్సాపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే వడ్ల కొనుగోలు కేంద్రం ఒకటే ఉండేదని, దాంతో రైతుల వడ్లు అమ్ము కోవాలంటే కళ్ళంలో ఆరబెట్టిన తర్వాత దాదాపు నెల రోజుల వరకు సమయం పట్టేదని అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన ఆఫీసర్లు ఈ సంవత్సరం బోరునర్సాపురంలో అదనంగా మరో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలు ఉండడం వలన రైతుల వడ్లు తక్కువ సమయంలోనే కాంటాలు అయ్యి అమ్ముడుబోతాయని, దీంతో అన్నదాతలకు కలిసి వస్తుందని అన్నారు. అయితే వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలోని నిరుద్యోగులకు ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేయడం హర్షించదగిన విషయమని అయితే గ్రామంలోని మరో వడ్ల కొనుగోలు కేంద్రంతో పాటు మండలంలోని అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహణ కూడా నిరుద్యోగులకు వచ్చేలా వారు చూడాలని డిమాండ్ చేశారు. గ్రామంలో అదనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వలన రైతులకు లాభమని, రైతులకు లాభం కలగడం కొంతమందికి ఇష్టంలేనట్లు విమర్శలు చేస్తున్నారని అలాంటి వారిని రైతు ద్రోహులుగా భావించాల్సి వస్తుందని అన్నారు. రైతులకు మేలు చేసే వడ్ల కొనుగోలు cకేంద్రంపై కొంతమంది కావాలని చేసే దుష్పచారాన్ని ఆఫీసర్లు నమ్మవద్దని గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: