CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనేతరుల తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు ఆదివాసీ బిడ్డలు ముక్తకంఠంతో ఖండించాలి.

Share it:


    

మన్యంటీవీ మంగపేట. 

మంగపేట మండలంలో మన్యసీమ పరిరక్షణ సమితి,  డోలు దెబ్బ, ఆదివాసీ సేన  నాయకులు  తహసీల్దార్ కార్యాలయంలో,  తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ కు గిరిజనేతర సంఘాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగినది. మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ ఆధ్వర్యంలో గిరిజనేతరులు చేసే తప్పుడు ప్రకటనలు, అసత్యపు ఆరోపణలమీద గిరిజనులు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం అనితెలిపారు, గిరిజనేతరులు చేస్తున్న ప్రచారం షెడ్యూల్డ్ ఏరియా మీద స్టే ఉందని, ఈ విషయం పై కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు, మంగపేట మండలం ఏజెన్సీ ఏరియా కాదని, మంగపేట మండలం షెడ్యూల్డ్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం పై హైకోర్టు లో ఎటువంటి వివాదం లేదు ఇది నాన్ షెడ్యూల్డ్ ఏరియా కాదు, దీనిపై 17/4/2014 న దీనిపై ఉన్న పెండింగ్, మరియు తప్పడు కేసులు కొట్టి వేస్తూ మంగపేట మండలం ను షెడ్యూల్డ్ ఏరియాగా తీర్పునివ్వడం జరిగింది. గిరిజనేతరులు అనే  స్టే ఎంపీపీ ల రిజర్వేషన్ కు  సంబంధిచినది. భారత రాజ్యాంగం 5 వ షెడ్యూల్డ్ భూ భాగంలో ఉద్యోగ రీత్యా తహసీల్దార్, యస్ ఎచ్ వో, ఎంపీడీఓ, ప్రభుత్వ నిబంధనల మేరకు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల కు తప్పుడు సమాచారం ఇచ్చి గిరిజనులఅభివృద్ధికి గిరిజనేతరులు  ఆటంకంగా తయారవుతున్నారు. 1973 సంవత్సరం మంగపేట తహశీల్ పరిధిలోని 23 రెవిన్యూ గిరిజన గ్రామాలను గిరిజనేతరులు ఎన్ని కేసులు వేసినప్పటికీ నాన్ షెడ్యూల్డ్ ఏరియా గా నిరూపించబడలేదు. గిరిజనేతరులు 1973 నుండి అలుపెరుగనిపోరాటం చేస్తున్నారు కానీ అదంతా వ్యర్థం,  ఈ సందర్బంగా మన్య సీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ నాయకులు, తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసీ సేన నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో  మన్యసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య, తుడుం దెబ్బ జిల్లా నాయకులు అన్నెబోయిన సమ్మయ్య, ఆదివాసి సేన మండల అధ్యక్షులు పోలెబోయిన ఆదినారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: