CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగర్ సునీత పెళ్లి.. వరుడు ఎవరంటే ?

Share it:

    


 

నేపథ్యగాయనిగా, టెలివిజన్ యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సింగర్ సునీత తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు సంపాదించుకున్నారు. శాస్త్రీయ సంగీతం అయినా, పాప్ పాట అయినా సునీత శైలిలో పాడితే వినేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ.. పైకి మాత్రం ఆమె చిరునవ్వుతో కనిపించేవారు. సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ చానల్ లో అలీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పారు.


చాలా ఏళ్ళ క్రితం తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత  ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నానని ఆమె అప్పుడు చెప్పుకొచ్చింది. పుకార్లతో తనకెలాంటి ఇబ్బంది లేదని, తన కుటుంబానికి వాస్తవాలేమిటో తెలుసునని అన్నారు. తాను ఎప్పటికీ సింగిల్ గానే ఉంటానని చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు మరలా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ ని ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఇదివరకే పెళ్ళయిందని అంటున్నారు. ఈ అంశం మీద క్లారిటీ రావలసి ఉంది. ఇక సునీతకు ఒక కుమార్తెె, ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు  ఆమె త్వరలో ఈమేరకు ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Share it:

CINEMA

FEATURE

Post A Comment: