CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎల‌క్ర్టిక్ వాహ‌నాల హ‌బ్‌గా తెలంగాణ : మ‌ంత్రి కేటీఆర్

Share it:


  

హైద‌రాబాద్ : తెలంగాణ‌ను ఎల‌క్ర్టిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చ‌బోతున్నామ‌ని, ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు ప‌ర్యావ‌ర‌ణ ఫ్రెం
డ్లీ వెహిక‌ల్స్ అని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్ప‌టికే టీఎస్ ఐపాస్‌, బీఎస్ ఐపాస్ విజ‌య‌వంతం అయ్యాయి. ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు కూడా విజ‌య‌వంతం కాబోతున్నాయి. గ‌త ఐదేళ్ల‌లో తెలంగాణ‌కు 2.8 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 

రాష్ర్ట ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎల‌క్ర్టిక్‌ వెహి‌కిల్‌ (ఈవీ) పాల‌సీని ఐటీ, పరి‌శ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్, రవా‌ణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క‌లిసి శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని మర్రి చెన్నా‌రెడ్డి మానవ వన‌రుల కేంద్రంలో తెలం‌గాణ ఈవీ సమ్మి‌ట్‌లో పాల‌సీ విధానాన్ని ప్ర‌క‌టించారు. 2020-2030 వ‌ర‌కు ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ, వినియోగంపై విధాన‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఐదు కంపెనీల‌తో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌తో పాటు రైతులు ఇబ్బందులు ప‌డ్డారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల్సిన అవ‌స‌రం మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. కాలుష్యాన్ని అరిక‌ట్టాల్సిన బాధ్య‌త‌ను క‌రోనా మ‌రోసారి గుర్తు చేసింద‌న్నారు. కాలుష్యం లేని వాతావ‌ర‌ణాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కు మ‌నం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని తెలిపారు. డీ కార్బ‌నైజేష‌న్‌, డిజిటలైజేష‌న్‌, డీ సెంట్ర‌లైజేష‌న్ అమ‌లు చేయాల‌ని సూచించారు. మ‌రి కొన్నేళ్ల‌లోనే రాష్ర్టంలోని జ‌నాభా గ్రామాల కంటే ప‌ట్ట‌ణాల్లోనే ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. రాష్ర్ట జీఎస్‌డీపీలో 50 శాతం హైద‌రాబాద్ నుంచే వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.


వెయ్యి ఎక‌రాల్లో ఆటో మొబైల్ త‌యారీ యూనిట్‌ 


మ‌న వ‌ద్ద పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉంద‌న్నారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఛార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ త‌యారీ కంపెనీలు పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయి. ఎల‌క్ర్టిక్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కోసం అందుబాటులో భూములు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌హేశ్వ‌రంలో వేల ఎక‌రాలు అందుబాటులో ఉన్నాయి. వెయ్యి ఎక‌రాల్లో ఆటో మొబైల్ త‌యారీ యూనిట్‌ను ప్రోత్స‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వాహ‌నాల త‌యారీ, నిర్వ‌హ‌ణ‌కు కంపెనీల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. 

గ‌తంలో ఈసీఐఎల్ వంటి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌తో ఎల‌క్ర్టానిక్స్ రంగంలో దేశానికే హైద‌రాబాద్ కేంద్రంగా ఉండేది. ఎల‌క్ర్టిక్ వాహ‌నాల నూత‌న విధానం అద్భుతంగా విజ‌య‌వంతం కాబోతుంద‌న్నారు. హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ యూనిట్లు నెల‌కొల్పుతామ‌ని చెప్పారు. ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ రంగంలో కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే 78 ఛార్జింగ్ స్టేష‌న్లు ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో ఉన్నాయ‌న్నారు. ఐటీ ఉత్ప‌త్తుల ఎగుమతుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌న్నారు. ఐటీ రంగంలో జాతీయ స్థాయి కంటే ఎక్కువ అభివృద్ధి రేటు ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ర‌వాణా శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సునీల్ శ‌ర్మ‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, సినీ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఛైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: