CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ మిర్చిబోర్డు డైరెక్టర్ గా సాంబశివరెడ్డి . జిల్లా రైతుకి అరుదైన గౌరవం*

Share it:


మన్యం టీవి, పినపాక: ములుగు జిల్లా మంగపేట మండలం అక్కినపల్లి మల్లారం మారుమూల గ్రామానికి చెందిన వికాస్ అగ్రి ఫౌండేషన్  చైర్మన్  నాశిరెడ్డి.సాంబశివరెడ్డి ని    జాతీయ మిర్చి  టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ గా  నియమిస్తూ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.ఈ కమిటీ చైర్మన్ గా  ఏపీ రాజ్యసభ యంపీ జీవియల్.నరసింహారావు తోపాటు,  దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలనుండి మిర్చిపంట  అనుబంధ విభాగాలనుండి 52మంది కి  ఈ కమిటీలో చోటు కల్పించారు, సీడ్, ట్రేడర్స్,   ఎక్స్ పోర్ట్రర్స్, రైతు, రీసెర్చ్, ఎక్స్ టెంక్షన్, ఎన్జీవో   విభాగాలవారితో పాటు, రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు  ప్రాతినిధ్యం లభించింది. ముఖ్యంగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప కుమారుడు, శివమొగ్గ పార్లమెంట్ ఎంపీ రాఘవేంద్రకి ఈ కమిటీలో  స్థానం లభించింది.ఈ మేరకు యడ్యూరప్ప ఢిల్లీలో చక్రం తిప్పారు. ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు  ఆశీసులతో కొందరికి ఈ కమిటీలో పదవులు దక్కినట్లు తెలుస్తోంది. సింహ భాగం పదవులు బీజేపీ నేతలకే దక్కాయి.మనరాష్ట్రం నుండి మొత్తం ఏడుగురికి డైరెక్టర్స్ గా  చోటు దక్కగా, ఇద్దరు ఎక్స్ పోర్ట్రర్స్,ఒక ట్రేడర్, ఇద్దరు శాస్త్రవేత్తలు కాగా, బీజేపీ రాష్ట్రనేత విక్రమ్  మరియు  "వికాస్ అగ్రి ఫౌండేషన్" చైర్మన్  నాశిరెడ్డి . సాంబశివరెడ్డి కి  ప్రాతినిధ్యం లభించటం విశేషం.వ్యవసాయరంగంలో సాంబశివరెడ్డి చూపిన ప్రతిభాపాటవాలు, అవార్డులు  విధేయతను ప్రభుత్వం గుర్తించటంతోపాటు,  నియామకంకోసం ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,  ఒక కేంద్ర మంత్రి కృషి చేసిన విషయం తెలిసేందే...కాగా...  ఈ  కమిటీ పాలకమండలి  మూడు  సంవత్సరాల పాటు  కొనసాగుతుంది.కోవిడ్ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలమేరకు ఆన్ లైన్ వెబ్ ద్వారా బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ రాష్ట్రం నుండి NGO విభాగం నుండి సాంబ శివరెడ్డి కి  ప్రాతినిధ్యం లభించింది.ఈ మేరకు సాంవశివరెడ్డి తన నియామకానికి సహకరించిన  కేంద్ర ప్రభుత్వంతోపాటు, తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు కృతజ్ఞేతలు తెలిపారు.రైతు సేవలకు పునరంకితం అవుతానని తెలిపారు.
కాగా, మన్యం ప్రాంతంలో పుట్టిన మట్టిబిడ్డ నాశిరెడ్డి.సాంబశివరెడ్డి  కి  జాతీయ స్థాయి కమిటీలో ప్రాతినిధ్యం లభించటంపట్ల ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.అకినేపల్లి నుండి హస్తిన కు  వెళ్లటంపట్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Share it:

TELANGANA

Post A Comment: