CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య

Share it:

మన్యం టీవి, ములుగు, సెప్టెంబర్ 11: జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన 31 రైతు వేదికల నిర్మాణాలు వ్యక్తిగత శ్రద్ధతో పూర్తి చేయాలన్నారు. ఏ ఏ ప్రదేశాల్లో ఎంత మేర ఇసుక అవసరమో ఇండెంట్ ఇవ్వాలని సరఫరాకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేని ప్రదేశాల్లో ఇతర శాఖల ఆధీనంలో ఉన్న స్థలం సేకరించినచో, ఆ శాఖాధికారి నుండి రాటిఫికేషన్ పొందాలన్నారు. జిల్లాలో 1783 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, 1780 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటికి 390 పూర్తి అయినట్లు తెలిపారు. క్రొత్త ఇండ్ల మంజూరుకు అవకాశం ఉన్నచో చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రదేశాల వారీగా నిధుల విడుదల, ఖర్చు, కావాల్సిన నిధుల నివేదిక సమర్పించాలన్నారు. వివిధ శాఖల ద్వారా చేపట్టి నిధులు కావాల్సి, పనులు పూర్తి కాని గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, సబ్ సెంటర్ భవనాల నిర్మాణాలున్నచో, కావాల్సిన నిధుల గురించి సైన్ స్టాంప్ తో నివేదిక సమర్పించాలన్నారు. నివేదిక మేరకు నిధులు మంజూరు చేయనున్నట్లు, అసంపూర్తిగా వున్న భవనాలు పూర్తిచేసి, ఉపయోగం లోకి తేవాలన్నారు. డిఎంఎఫ్టి క్రింద పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 82 పనులు మంజూరు కాగా, 73 పనులు ప్రగతిలో ఉన్నాయని, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 41 పనులకు 26 పనులు పూరయినట్లు, మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు, రోడ్లు, భవనాల శాఖ ద్వారా 9 పనులకుగాను 5 పూర్తయినట్లు, 3 ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. పనులు అగ్రిమెంట్ లోగా పూర్తిచేయకుండా, ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అగ్రిమెంట్ కాలాన్ని పొడిగించిన పనుల్లో నిధులను పనులు పూర్తి అయిన పిదపనే మంజూరు చేస్తామన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేయాలని, రోజువారీ పనుల పరిశీలన చేసి ప్రగతికి సంబంధించి ఫోటోలు పంపాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల పూర్తి పై అలసత్వం సహించేది లేదని, పనుల పూర్తిలో వెనుకబడిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, పంచాయతీ రాజ్ ఇఇ రాంబాబు, గిరిజన సంక్షేమ శాఖ డిఇ నిరంజన్, రోడ్లు భవనాల శాఖ డిఇ రఘువీర్, శాఖల డిఇలు, ఏఇలు తదితరులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: