CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య

Share it:


  • ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య
  • భూ రెగ్యులరైజేషన్ కోరకు అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి
  • అక్రమ లేఅవుట్లు తప్పనిసరిగా క్రమబద్దికరించుకోవాలి 

మన్యం టీవి,ములుగు, సెప్టెంబర్ 14::- ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమలుకు సంబంధించి కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ లో కరపత్రాన్ని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ లేఔట్, ఇతర భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొని వచ్చిందని దీనిపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.   అక్రమ లేఔట్, ఇతర భూముల క్రమబద్ధీకరించు కునేందుకు ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో గ్రామాల్లో ఎల్ ఆర్ ఎస్ స్కీం అమలవుతుందని అన్నారు. ఆగస్టు 26,2020 నాటికి రిజిస్టర్ అయిన సెల్ డీడ్ ప్లాట్లు భూములు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అర్హత ఉంటాయని తెలిపారు. 10% విక్రయాలు జరిపిన అక్రమ లేఅవుట్ల సైతం క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.  భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ఆన్ లైన్ లో https://lrs.telangana.gov.in  అనే వెబ్ సైట్ లో అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత  భూముల కోసం రూ.1000/-, లే ఔట్ల కోసం రూ 10 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. భూముల క్రమబద్ధీకరణ కోసం 100 చదరపు మీటర్లు గల భూమికి చదరపు మీటరుకు రూ. 200/-, 300 చదరపు మీటర్లలో గల భూమి కి చదరపు మీటర్ కు రూ.400/-, 500 చదరపు మీటర్లు లో గల భూమికి చదరపు మీటర్ కు రూ.600/-,500 చదరపు మీటర్లు పై గల భూమి కి చదరపు మీటర్ కు రూ.750/- దరఖాస్తు రుసుం చెల్లించాలని, భూముల క్రమబద్ధీకరణ కోసం స్థలం మార్కెట్ వ్యాల్యూ అనుగుణంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 3000 చదరపు గజాల భూమికి 25% మార్కెట్ వ్యాల్యూ, ఐదు వేల గజాల భూమికి 50% మార్కెట్ వాల్యూ, 10 వేల గజాల భూమికి 75% మార్కెట్ వాల్యూ, 10వేల గజాలకు పైగా ఉన్న భూమి క్రమబద్ధీకరణకు 100% మార్కెట్ వాల్యూ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.  అక్రమ లేఔట్ల లో 10% ఓపెన్ ప్లేస్ లేకపోతే 14% అపరాధ రుసుము అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, భూముల క్రమబద్ధీకరణ కొరకు జనవరి 31, 2021 లోపు సదరు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.  చెరువులు, కుంటలు ,నదీ గర్భంలో ఉన్న భూములు, శీఖం భూముల,నాలా భూముల క్రమబద్ధీకరణ చేయరాదని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి భూమి క్రమబద్ధీకరించు కోవాలని, లేనిపక్షంలో సదరు భూములలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని త్రాగునీటి సరఫరా డ్రైనేజ్ విద్యుత్ వంటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం అనుమతులు ఇవ్వబోమని తప్పనిసరిగా అక్రమ భూముల క్రమబద్ధీకరణ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 100% అక్రమ ప్లాట్లు లేఅవుట్ల క్రమబద్ధీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: