CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహాలక్ష్యంతో.. మన్యం మనుగడ, మన్యం టివి ....ఆదివాసీ ఎమ్మెల్యే కాంతారావు వినూత్న ప్రయత్నం

Share it:


  • మహాలక్ష్యంతో.. మన్యం మనుగడ, మన్యం టివి
  • ఆదివాసీ ఎమ్మెల్యే కాంతారావు వినూత్న ప్రయత్నం
  • వెనుకబాటు నుండి చైతన్యపరిచేందుకు మీడియా
  • రెండు రాష్ట్రాల గిరిజన చైతన్యం కోసం వ్యూహాత్మక అడుగులు 


మన్యం టివి, హైదరాబాద్ :

అడవితో తరతరాలుగా చెరగని బంధం ఆదివాసులది. స్వాతంత్య్రం వచ్చి ఏడుదశాబ్దాలు గడిచినా ఇంకా వెనుకబాటులోనే ఉన్న ఆదివాసీలు అన్నిరంగాల్లో వృద్ది చెందాలని.. ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాల గురించి, అవకాశాల గురించి అవగాహన పరచాలని పోటీయుగంలో ఇతరులకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆ ఎమ్మెల్యే పరితపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మన్యం జాగృతికోసం ఏకంగా మీడియానే పెడుతూ.. మన్యం భాషల్లోనూ కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నాడు. ఎంతో ఖర్చుతో కూడుకున్నా.. మన్యం ప్రజల మనుగడ కోసం, ఎదురవుతున్న సవాళ్ళను, ప్రస్తుతం ఉన్న చట్టాలు..హక్కులు, ఆదివాసీల జీవనస్థితులు, ప్రగతిమార్గాల గురించి వివరిస్తూ వెలుగుబాట పట్టించాలన్న దృడ కాంక్షతో పనిచేస్తూ ప్రశంసలందుకుంటున్నాడు. ఆయనే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు. మన్యం చరిత్రలో మరెవరూ చేయని సాహసాన్ని భుజాలకెత్తుకున్న కాంతారావు.. సంఘాలు కట్టి మాటలు చెప్పే పాత పద్దతులకు భిన్నంగా మన్యంయువతను, ఆదివాసీ తెగలను జాగృతపరచడమే లక్ష్యంగా సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నాడు. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాకుండా ములుగు ఏజెన్సీ, ఆదిలాబాద్‌ ఉట్నూరు, ఆసిఫాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని తెగలను అవగాహన పరిచేందుకు, ఐక్యం చేసేందుకు కూడా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆదివాసీ తెగలు.. అన్నిరంగాల్లో దూసుకురావాలని, సరికొత్త ఆలోచనలతో సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ప్రపంచంలో ఏరంగంలోనైనా దూసుకెళ్తామన్న ఆత్మవిశ్వాసం పెంపొందించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం మన్యంమనుగడ మాసపత్రిక, మన్యం టీవీ, మన్యంటివి.కామ్‌ వెబ్‌సైట్‌, మన్యంటివియాప్‌లను ప్రారంభిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు నియోజకవర్గాల్లో ఉన్న ఆదివాసీ తెగలకు సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో ఆదివాసీలు ముందడుగు వేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులతో సంప్రదింపులు జరుపుతున్న కాంతారావు.. రాష్ట్రంలో శాసనసభ విప్‌గా ఉన్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా, అమలుకాని పథకాలు.. లేదా వివక్ష ఉన్నచోట ఒత్తిడి తీసుకొచ్చి దానిని సరిచేసేలా కొత్తపంథాలో పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆదివాసీ విద్య, భాషలు, హక్కులు, చట్టాలు, ఉద్యమాలు, ఉపాధి అవకాశాలు, పోడు అంశాలు, ఇతర రాష్ట్రాలలో ఆదివాసీల జీవనవిధానం, ముందున్నకర్తవ్యాలు, ఎదురుకానున్న సవాళ్ళు, ఏర్పరుచుకోవాల్సిన కొత్తపంథా వంటివన్నీ మన్యం మనుగడ మాసపత్రికలో పొందుపరుస్తున్నారు. గతంలోనూ టీఆర్ఎస్‌ నుండి అనేకమంది ఎమ్మెల్యేలు గెలిచినా.. ఎవరూ ఇలాంటి ఆలోచనలు చేయలేదు. ముందుచూపుతో వ్యవహరించే కాంతారావు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తిగా ముందుగా ఆదివాసీలను అవగాహన పరిచి, ముందడుగు వేయించేందుకు ఏకతాటిపైకి తెచ్చేందుకు మన్యంమీడియానే సరైన వేదికగా భావిస్తున్నారు. ఆదివాసీలలో ఉన్న న్యూనతాభావం, ఐక్యతాలోపం వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ మీడియా దోహదపడుతుందని మేధావులు చెబుతున్నారు. ఇక తెలుగుతో పాటు కోయ, గోండుభాషల్లోనూ వార్తలు, కథనాలు చదివించాలని, ఆదివాసీ సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలకు పెద్దపీఠ వేసేలా మన్యంటివి యూట్యూబ్‌ ఛానల్‌కు శ్రీకారం చుడుతున్నారు. మన్యం సమాచారంతో వెబ్‌సైట్‌, యాప్‌కు కూడా రూపకల్పన చేశారు.

మన్యంయువత ముందడుగే లక్ష్యం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మన్యం ప్రజల చైతన్యం కోసం, సమాజంలోని ఇతరవర్గాలతో పోటీపడి అవకాశాలు దక్కించుకోవడం కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆదివాసీ చరిత్ర, ఉద్యమాలు, హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించడం కోసం సమగ్రసమాచార మాసపత్రికగా మన్యం మనుగడ, సాంస్కృతిక వారధిగా మన్యం టివిని తీసుకువస్తున్నామని చెప్పారు. తన వేతనాన్ని మన్యం ప్రజల అవగాహన కోసం వెచ్చిస్తానని, యువత.. మన్యం విద్యావంతులు ఏజెన్సీలోని గిరిగీసుకుని తిరగకుండా సమాజంలో..ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు అధ్యయనం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. ముప్పయ్‌ నలభైఏళ్ళుగా కొందరు నాయకులు సంఘాలు పేరుచెబుతూ.. తాము అక్కడే ఉండి.. మన్యం ప్రజలను కూడా అక్కడే ఉంచారని, ఇది మారాలని.. రాజకీయాలు కాకుండా ప్రపంచీకరణ యుగంలో మన్యం యువత.. ప్రజలు వికసించాలంటే పాత పడికట్టు సంఘాలను విడిచిపెట్టి కొత్త ఆలోచనలు చేయాలన్నారు. ఈ అక్టోబర్ నుండి మన్యంమనుగడ మన్యం ప్రజల ముందుకొస్తుందన్నారు.
.................
Share it:

TELANGANA

Post A Comment: