CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నకిలీ ఔషధాలపై సీఎం జగన్‌ కొరడా

Share it:

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రంగ్‌ కంట్రోల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌ జనరల్, డ్రగ్స్‌ అండ్‌ కాపీరైట్‌ రవిశంకర్‌ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్కెట్‌లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 285కిపైగా యూనిట్లు,34వేలకు పైగా జౌషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పరిమితమైన మానవవనరులు, ల్యాబ్‌ కెపాసిటీ స్వల్పంగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. డ్రగ్‌ కంట్రోల్‌ కార్యకలపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ జౌషధాలను అరికట్టాల్సిందేని సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్‌ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు.
Share it:

AP

FEATURE

Post A Comment: