CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ శిక్షణకు ఇంటర్వ్యూలు

Share it:


  • రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ శిక్షణకు ఇంటర్వ్యూలు
  • ఎమ్మెల్యే కాంతారావు వల్లే ఏజెన్సీ యువతకు సువర్ణ అవకాశం 
  • రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో
  • యక్షిత ఐటి సర్వీసెస్‌, హైదరాబాద్‌ సౌజన్యంతో..


ఆదివాసీ గ్రాడ్యుయేట్లను సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లుగా తీర్చిదిద్ది.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగ అవకాశం పొందేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి సంబంధించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూ లు శనివారం జరిగాయి. మణుగూరు శ్రీవిద్యడిగ్రీ కళాశాలలో రాజుకంప్యూటర్స్ ఆధ్వర్యంలో పరీక్ష జరిగింది. పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు దార్శనికత్వంతో.. ఐదువారాల శిక్షణ, తర్వాత హైదరాబాద్‌, వరంగల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా ప్రత్యేక తర్ఫీదు దీనిద్వారా ఇవ్వనున్నారు. యక్షిత ఐటీ సర్వీసెస్ డైరెక్టర్, ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణులు కె. పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ లు జరిగాయి. ఆదివాసీ లను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా తీర్చిదిద్దాలన్న మహత్తర ఆశయంతో ఎమ్మెల్యే రేగాకాంతారావు ఎంతో వ్యయప్రయాసల కోర్చి హైదరాబాద్ లో జరగాల్సిన శిక్షణ మణుగూరుకు రప్పించారని, ఇందుకు ఎమ్మెల్యే కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీలు, నిరుద్యోగ యువత అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే కు ఉన్న నిబద్దత కు ఇది నిదర్శనం అని పవన్ కుమార్ అన్నారు. త్వరలోనే శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని, మణుగూరు ప్రాంతంలో ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు ఉన్నారన్నారు. చిత్తశుద్ధి తో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు చందా హరికృష్ణ, యూత్ నాయకులు రవిప్రసాద్, రుద్రవెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Share it:

AP

ARTICLES

SLIDER

TELANGANA

Post A Comment: