CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్నిర్మించండి.... ఆర్థిక ప్యాకేజిని అందిపుచ్చుకోండి

Share it:

మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులను తెరిచే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సంకేతాలిచ్చారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాపార సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్-9 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి, సామర్థ్యాలను పెంపొందించుకోడానికీ లాక్ డౌన్ సమయం ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ కాలంలో దేశం తనను తాను సిద్ధం చేసుకుందని అభిప్రాయపడ్డారు. మాస్కులు, శానిటైజర్లు, గ్లోవ్స్, పిపిఇ వంటి రక్షణ పరిసరాల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభించిందని తెలిపారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెరిగి, ప్రజలలో అవగాహన ఏర్పడిందన్నారు. అసాధారణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఐక్యంగా పనిచేయాలన్న ప్రధాన మంత్రి పిలుపునకు ప్రజల నుంచి విశేష స్పందన లబించిందని, వారు ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా నడచుకున్నారని కితాబిచ్చారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ఆరోగ్య సేతు యాప్ ప్రజలకు ఒక రక్షణగా, ఒక స్నేహితునిగా, ఒక దూతగా ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు వారి జీవనశైలిని మార్చుకున్నారు, క్లిష్ట పరిస్థితుల్లో భిన్నంగా జీవించడానికి, పని చేయడానికి, భిన్నంగా అధ్యయనం చేయడానికి త్వరగా అలవాటుపడ్డారని అన్నారు. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోలిస్తే, ఎక్కువ వనరులు, జనాభా ఉన్న మనం మెరుగైన స్థితిలో ఉన్నందున, ప్రధానమంత్రి తీసుకున్న సమయానుకూల నిర్ణయాలు దేశంపై సానుకూల ప్రభావాన్నే చూపాయని అన్నారు. మార్గదర్శకాల సడలింపు తర్వాత కూడా రిటైల్ వ్యాపారులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడుతూ, నిత్యావసర, నిత్యావసరం కాని వస్తువులు అనే వ్యత్యాసం లేకుండా దాదాపు అన్ని రకాల దుకాణాలను తెరవడానికి అనుమతించామని చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులలో దుకాణాలను తెరిచే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19తో పోరాడటం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆత్మనిర్బర్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందజేసే రూ. 3 లక్షల క్రెడిట్ గ్యారెంటీ వ్యాపారులందరికీ వర్తిస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఎం.ఎస్.ఎం.ఈ. రంగం నిర్వచనంలో చేసిన మార్పులు కూడా వారికి సహాయపడతాయని చెప్పారు. పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్థిక మంత్రి కూడా సూచించారని ఆయన గుర్తుచేశారు. ఇ-కామర్స్ వ్యాపారం వల్ల ముప్పు ఉంటుందని ఆందోళన చెందవద్దని గోయల్ రిటైల్ వ్యాపారులకు ధైర్యం చెప్పారు, ఎందుకంటే సంక్షోభ సమయంలో తమ పరిసరాల్లోని దుకాణదారులు మాత్రమే తమకు సహాయం చేశారని సామాన్య ప్రజలు గ్రహించారని వ్యాఖ్యానించారు. రిటైల్ వ్యాపారులకు బి2బిని సులభతరం చేయడానికి అవసరమైన యంత్రాంగంపై ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి విస్తరణకు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో ప్రభుత్వం పరివర్తన కార్యక్రమాలు చేపట్టిందని, ఇది భారతదేశం బలమైన దేశంగా మారడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. టర్మ్ రుణాలు, ముద్ర రుణాలు మరియు ఇతర వర్తక సమస్యల గురించి గోయల్ ప్రస్తావిస్తూ, ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించి, పరిష్కారం కనుగొంటామని చెప్పారు. ఆర్ధిక పునరుద్ధరణ ఆలోచనలో నలుగుతున్న అంశంగా పలు సూచికలు చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు. ఈ నెల విద్యుత్ వినియోగం గత ఏడాది ఇదే కాలంతో దాదాపు సమానంగా ఉంది, కాగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్‌ నెలలో దాదాపు 60 శాతం తగ్గిన ఎగుమతులు, ఇప్పుడు కాస్త నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నెలలో క్షీణించిన ప్రాధమిక గణాంకాలు చాలా చిన్నవి. మరోవైపు, సేవల ఎగుమతులు గత నెలలో కూడా పెరిగాయి. గత నెలలో వస్తువుల ఎగుమతులలో తగ్గుదల కంటే, దిగుమతులలో తగ్గుదల ఎక్కువగా ఉంది. దీంతో వాణిజ్య లోటు తగ్గింది. గత రెండు నెలల్లో వ్యాపారులు, భారతీయ తయారీదారుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, భవిష్యత్తులో కూడా వారికి సహకరిస్తామని మంత్రి చెప్పారు. భారతీయ వస్తువులను ఉపయోగించి, ప్రోత్సహించి, మద్దతు ఇవ్వాలని ఆయన వ్యాపారులకు పిలుపునిచ్చారు. విశ్వాసం, ధైర్యం, దృఢ సంకల్పంతో పనిచేస్తే, తప్పక విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని మంత్రి వారిని ప్రోత్సహించారు.
Share it:
Next
Newer Post
Previous
This is the last post.

ARTICLES

Post A Comment: