CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కీచక ఉపాధ్యాయ తస్మాత్ జాగ్రత్త పాఠశాలలో ప్రత్యేక నిఘా నేత్రం తరగతి గదుల్లో సీక్రెట్ ఏజెంట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం

Share it:



  •  కీచక ఉపాధ్యాయ తస్మాత్ జాగ్రత్త
  • పాఠశాలలో ప్రత్యేక నిఘా నేత్రం
  • తరగతి గదుల్లో సీక్రెట్ ఏజెంట్లు
  • తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం

మన్యం న్యూస్, జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01... అమ్మ నేను బడికి పోలేను.. ఇబ్బందిగా ఉంది.. ఏం జరుగుతుందో చెప్పలేను... ఉపాధ్యాయుడు ఎందుకో నాపై గుర్రుగా చూస్తున్నాడు.. హోంవర్క్ చేయలేదని సరిగా చదవలేదనే సాగుతూ ఎక్కడపడితే అక్కడ ముట్టుకుంటున్నాడు.. అవసరమైతే గిచ్చుతున్నాడు.. నేను పోలేనమ్మ అవసరమైతే చదువు మానేస్తా కూలి పనికి వెళతా.. కన్నీరు ఇంకినా కళ్ళతో చిన్నారుల అరణ్యరోదన తల్లిదండ్రుల దగ్గర మొరపెట్టుకున్న సంఘటనకు ఇక చెక్.. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల పాఠశాలలో విద్యార్థులకు భరోసా కల్పిస్తూ.. మేమున్నాం ఇక భయం లేదని అభయమిచ్చే విధంగా పాఠశాలల్లో ప్రత్యేక నిఘా నేత్రాలు ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తరగతి గదులల్లో కీచక ఉపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన వెకిలి చేష్టలకు చెక్ పడనుంది. ఇటీవల కాలంలో కొందరు ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరుపై విసిగి వేసారి పాఠశాలలకు రాకుండా కొందరు చిన్నారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈ సంఘటన తో పాటు బలవన్మరణాలు పొందిన సంఘటనలు లేకపోలేదు. తల్లిదండ్రులకు స్నేహితులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు సతమతమవుతూ పాఠశాలలకు అతికష్టంగా వెళుతూ కీచక ఉపాధ్యాయుల వికృత చేష్టలకు అనేక ఇబ్బందులు పడుతూ అమ్మ క్షమించు నేను వెళ్తున్నా అంటూ కొందరు విద్యార్థులు బలవన్మరణం పొందిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పునరావృతం అవుతున్నాయి. విద్యాలయాలు దేవాలయాలు గా భావించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తు ప్రణాళికలకు మార్గదర్శకం కావలసిన ఉపాధ్యాయులే కీచకులుగా మరి విద్యార్థుల పాలిట శాపమై వారి భవిష్యత్తు అంధకారంలో పెడుతున్నారు.

తస్మాత్ జాగ్రత్త ఉపాధ్యాయుల్లార..

పాఠాలు చెప్పే పంతులు విచక్షణ మరచి వికృత రూపంలో వెకిలి చేష్టలతో విద్యార్థులను వేధించే ఈ విధానానికి స్వస్తి పలకాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం కీచక ఉపాధ్యాయుల గుండెల్లో కలవరం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల వికృత చేష్టలతో విసిగివేసారి విద్యార్థులు బడికి దూరం కావడమే కాకుండా బలవన్మరణాలు పొందుతున్న సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కీలకం కానుంది

పాఠశాలల్లో సీక్రెట్ ఏజెంట్లు. తరగతి గదిలో నిఘానేత్రం

తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనుక ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల, వసతి గృహాలు తదితర వాటిల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలలో సీక్రెట్ ఏజెంట్లను నియమించనుంది. వంద మంది విద్యార్థులలో చురుకుగా ఉండే పది మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని సీక్రెట్ ఏజెంట్లుగా తయారుచేసి వారికి పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ద్వారా అన్ని రకాలుగా శిక్షణ ఇవ్వనుంది. ఆ శిక్షణలో నిర్భయంగా మాట్లాడటం ధైర్యంగా సమాధానం చెప్పటం తరగతి గదిలో ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరును నేరుగా పోలీసులకు సమాచారం అందించడం, తరచూ పాఠశాలను మానేసి ఇంటి వద్దనే ఉండే విద్యార్థినిల సమాచారంతోపాటు వారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని గోపిగా పోలీసులకు సమాచారం అందించడం సీక్రెట్ ఏజెంట్లు పనితీరు. సీక్రెట్ ఏజెంట్ల ద్వారా నిఘానేత్రం పెంచి తరగతిగదిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఒక వైపు విద్య అభ్యసిస్తూ ఉంటారు. సీక్రెట్ ఏజెంట్లు నిఘానేత్రం పనితీరును ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించవలసి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విధానాన్ని ఆయా పాఠశాలల్లో ప్రవేశ పెట్టినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నారుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడమే కాకుండా పాఠశాలల్లో కీచక ఉపాధ్యాయుల పని పట్టే విధంగా సీక్రెట్ ఏజెంట్ల విధానం సఫలీకృతం అయితే ఎలాంటి భయం లేకుండా పాఠశాలలకు వెళ్లి విద్యనభ్యసించి విద్యార్థుల బంగారు బాటను వేసుకునేందుకు సులువైన మార్గం లభించినట్లే అవుతుందని పలువురు మేధావులు విశ్వసిస్తున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల వెకిలి చేష్టలు వికృత రూపాలు అసభ్యకర పదజాలాలకు చెక్ పడనుంది. అదే రీతిలో చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. నిఘా నీడలో పాఠశాలలు తస్మాత్ జాగ్రత్త

Share it:

TELANGANA

Post A Comment: