CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వతంత్ర భారతదేశం లో దళితుల మీద దాడులు ఆగటం లేదు దళితుల పై దాడులు ఖండిస్తున్నాము మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా బరువా తాలూకా లోని గ్రామంలో దళిత కుటుంబం మీద జరిగినఅమానుష సంఘటన విచారకరం. రామాలయం లోకి వచ్చారని 20 మంది కలసి ఒక కుటుంబం మీద రక్తాలు కారేలా కొట్టడం ఏమిటీ,భారతదేశం లో స్త్రీలను గౌరవిస్తారు, గోవులను పూజిస్తారు, అటువంటి దేశం లో నివసిస్తూ స్త్రీలను సైతం ఇంత దారుణంగా కొట్టడం అత్యంత అమానుషం.దళితులంటే పశువుల కంటే హీనమా, స్వాతంత్ర ఫలాలు 75 సంవత్సరాలనుండి అనుభవిస్తూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన మీ తోటి మానవులను ప్రేమించలేని, సహించలేని క్రూర ఉన్మాదం లో కొట్టుకుపోతున్నారు,ముందు తోటి మానవులను ప్రేమించడం నేర్చుకోండి,హిందువులు హిందూ దేవాలయంలోకి రావడం తప్పు కాదుకదా, దేవాలయాలు అంటే ప్రజలందరికీ చెందినది, కులం అనేది ఒక కుళ్ళు, మతం  మత్తు నుండి బయటకు రండి, అంటూ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి తీవ్రవిచారం వ్యక్తంచేశారు.గుజరాత్ లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సాక్షాత్తు ప్రధానమంత్రి స్వరాష్ట్రంలోనే ఇటువంటి సంఘటన జరగటం దేశ ప్రతిష్టకే భంగం,ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం, దోషులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: