CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పార్టీ కార్యాలయం ఒక దేవాలయం -మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగళ్ళుపు చెన్నకేశవ రావు

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం నియోజకవర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అట్టహాసంగా నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల  అధ్యక్షులు మాట్లాడుతూ ఈరోజు అశ్వారావుపేట నియోజవర్గం హెడ్ క్వార్టర్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పేదవాడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని పేదవాడు ప్రశాంతంగా బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు, ఇందిరా గాంధీ స్వయంకృషితో పార్టీ పెట్టి ప్రజలలోకి తీసుకెళ్లిందని ఎటువంటి స్వార్థం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. సోనియా గాంధీ కుటుంబం స్వార్థం లేని కుటుంబం అని ఎప్పుడు కూడా అధికారం కోసం ఆరాటపడలేదని రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా పదవులు వద్దు అని సాధారణ కార్యకర్తలారా పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని రాహుల్ గాంధీ  కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జూడో యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి కార్యకర్త కూడా నిజాయితీగా తలఎత్తి మీ నాయకుడు ఎవరో చెప్పుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఢిల్లీ సీఎం అయినా అరవింద్ కేజ్రివాల్ రాజీవ్ గాంధీ స్థాపించిన త్రిబుల్ ఐటీ కాలేజ్ లో చదువుకొని నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం రాష్ట్రాల కోసం ప్రాణ త్యాగాలు  చేసిన కుటుంబం అన్నారు పార్టీలు ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ పార్టీకి నష్టం చేసే అభిప్రాయ భేదాలు ఉండకూడదు అన్నారు మా పార్టీ ఆశావాదులకి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారి కోసం మేము కష్టపడి పనిచేసి గెలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో పార్టీ కార్యాలయం లేక జనం సమస్యలు తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉండేదని అన్నారు పార్టీ కార్యాలయం ఉండటం వలన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సమస్యలను తీర్చవచ్చు అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ 5 మండలాల్లో కూడా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల నాయకులు ఓబీసీ జిల్లా అధ్యక్షులు తుమ్మ రాంబాబు, ఎంపిటిసి వేముల భారతి, సత్యవరపు తిరుమల, ఆశుపాక ఎంపీటీసీ అనసూయ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బూసి పాండురంగ, ఎస్టీ సెల్  అధ్యక్షులు సంఘ ప్రసాదు, అశ్వారావుపేట పట్టణ అధ్యక్షులు చిన్నంశెట్టి రామకృష్ణ, అశ్వారావుపేట మండలం మహిళా అధ్యక్షురాలు ముద్దు మరియమ్మ, సత్యం రామకృష్ణ, బండారు మహేష్, సత్య వరపు బాలయ్య, దమ్మపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్య ప్రసాద్, ములకలపల్లి పార్టీ అధ్యక్షులు పెటేటి నరసింహారావు, నియోజకవర్గ నాయకులు దంజు నాయక్, వగ్గెల పూజ,  జుజ్జురి దుర్గారావు, పూనెం వెంకటస్వామి, నరదల సర్వేశ్వరరావు, తగరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: