గుండాల: మన్యం న్యూస్ (02) తుడుం దెబ్బ రాష్ట్ర మాజీ కార్యదర్శి జవాజీ లక్ష్మీనారాయణ కోసం కృషి చేస్తామని తుడుం దెబ్బ మండల కార్యదర్శి గోవిందా నరసింహారావు అన్నారు. ఆదివారం జవాజి 59వ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. జవ్వాజి గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన అన్నారు. ఆదివాసి ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందించేందుకు జవాజి వెళ్లలేని కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఆదివాసులను అడవికి దూరం చేసేందుకు పార్లమెంటు సాక్షిగా కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రమేష్ , ఈసం వెంకన్న, ఎస్.కె సాహెబ్, ఎస్.కె ఆజాద్ ,మొక్క నరి, మొక్క రాజు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: