CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆపద్భాంధవుడికి ఆత్మీయ సత్కారం చేసిన చర్చి పాస్టర్ శామ్యూల్

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : మంగపేట మండలం రాజుపేట గ్రామం లోని యేసు క్రీస్తు కల్వరి ప్రార్ధన మందిరంలో 3 రోజుల ఉపవాస ప్రార్ధనలలో భాగంగా  చర్చి పాస్టర్ శామ్యూల్ ఆహ్వానం మేరకు శనివారం శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ట్రస్ట్ సభ్యులు హాజరై నారు.ఈ సందర్బంగా చర్చి పాస్టర్ శామ్యూల్ మాట్లాడుతూ శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ పేరుతో బాడిశ నాగ రమేష్, సభ్యులు చేస్తున్న సేవలు చాలా గొప్పవి, ఎందుకంటే కులం, మతం ప్రమేయం లేకుండా జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు ఆర్థికంగా బాధలో ఉండి తీవ్ర బాధలు పడుతున్న వారికి ఆపద్బాంధవుడిగా,పేదల పెన్నిధిగా  సహృదయంతో ఆర్థిక సహాయ సహకారాలు అందించడం అమోఘం అంటూ,అటువంటి ఉన్నతమైన భావాలు కలిగిన బాడిశ నాగ రమేష్,వారి సేవలకు గాను చర్చి పాస్టర్ సంఘ పెద్ద చర్చి సభ్యులు శామ్యూల్, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు వారు చేస్తున్న సేవలను గుర్తించి కృతజ్ఞతగా శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.అనంతరం ట్రస్ట్ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒకటే అని మనవ సేవే మాధవ సేవ, ఆపదలో ఉన్న పేద ప్రజలకు సేవ చేస్తే అది దేవునికి సేవ చేసినట్లు అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఇందారపు రమేష్,మంచర్ల కిశోర్,మంచాల నాగేంద్ర కుమార్,చిట్యాల రాజశేఖర్, గుగ్గిల్ల సురేష్,బోడ ప్రవీణ్, బాడిశ ఆదినారాయణ,చౌలం సాయి బాబు,గట్టిపల్లి అర్జున్,చౌలం వేణు,యలమంద రావు, కనుకుంట్ల నాగరాజు,మునిగిల .మహేష్,చర్చి సంఘ పెద్ద  సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: