CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో... సింగరేణి డైరెక్టర్ (పా) ఎస్ చంద్రశేఖర రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08... గిరిజన సంఘాల నాయకులు ఫిర్యాదు మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సింగరేణి డైరెక్టర్ (పా) ఎస్. చంద్ర శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి న గిరిజన లంబాడ ఐక్య ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ దారావత్ రాజ్ కుమార్ ఈనెల 7వ తేదీన

కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ కు వెళ్లి సింగరేణిలో ఇటీవల కాలంలో భర్తీ చేపట్టిన 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి సమస్యలున్న కొంతమంది గిరిజన అభ్యర్థుల గురించి రిప్రజెంట్ చేయడానికి సింగరేణి డైరెక్టర్ పా  ఎస్.చంద్రశేఖర్  చాంబర్లో కలిశారని, డైరెక్టర్ ఛాంబర్ లోకి అతనితో పాటు గిరిజన అభ్యర్థులు అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు  సింగరేణి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో  సూపరిండెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న  గోళ్ళ రమేష్   వచ్చారని అన్నారు.   గోళ్ళ రమేష్  అభ్యర్థన మేరకు మణుగూరు నుంచి వచ్చిన గిరిజన నిర్వాసితురాలు బానోత్ మాధవి  తన ఉద్యోగ నిమిత్తమై డైరెక్టర్ ను కలిసి సమస్యలను విన్నవించుకున్నారు అని అన్నారు. ఈ విషయంలో డైరెక్టర్  చంద్రశేఖర్  చాలా అసహనంతో చిరాకుగా  గట్టి స్వరంతో "నువ్వేదో ఇక్కడ ఆఫీసర్ అని ఎంటర్టైన్ చేశాను. నువ్వు వీళ్ళ సమస్యలు రిప్రజెంట్ చేయడానికి కుదరదు. ఏదో ఒకసారి అంటే పోనీలో అని ఊరుకున్నా. కానీ నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ బయటికి వెళ్ళిపో" అని కసిరారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: