CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ పార్టీ ఆవిర్భవన శుభ పరిణామం -ఎంపీపీ జల్లిపల్లి. పాలాభిషేకం, బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేసిన ఎంపీపీ జల్లిపల్లి

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టి నీ భారత్ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్భంగా అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు ఆదేశానుసారం అశ్వారావుపేట  రింగ్ రోడ్డు సెంటర్ నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కెసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన  అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, మరియు మండల నాయకులు, అనంతరం స్వీట్స్ పంచి బాణాసంచా కాల్చడం జరిగింది. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ తెలుగోడి వేడి తగలలనే బిఆర్ఎస్ పార్టి 

ఆనాటి తెలుగోడు ఎంటిఆర్ ఈ నాటి తెలుగోడు కెసిఆర్. తెలంగాణ జెండా ఢిల్లీ నగరం లో ఎగరాలనే సంకల్పంతో ఈ జతియ పార్టి మొదలు పెట్టారని,

మన దగ్గర నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నది ఎక్కువ, మనకు ఇచ్చేది తక్కువగా ఉంది. అలాగే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రవేటీకరణ చేసే విధంగా ప్రణాళికలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేస్తున్న బీజేపీ పార్టీని ఎండగట్టల్సిన అవసరం ఉంది. ప్రజాల మనోభావాలు చూడకుండా నల్ల రైతు చట్టాలను తెచ్చి రైతుల వెన్ను వీరిచే ప్రయత్నం చేసిన ప్రభుత్వం సుమారు సవత్సరం 3 నెలలపాటు రైతులందరూ ధర్నాలు చేస్తే వారీ మీద విచక్షణ రహితంగా దాడి చేసిన కనికరం లేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని, కెసీఆర్ తలపెట్టిన బిఆర్ఎస్ పార్టి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు అవుతున్న రైతు భీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్ అలాగే రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందని, అలాగే వ్యవసాయ మీటర్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది అని, కేంద్రం చేసే ఈ పనులన్నింటినీ రేపు మనుగొడులో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టి అభ్యర్థిని గెలిపించి బీజేపీ పార్టికి కనువిప్పు కలిగించాలనీ రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టి టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, సెక్రెటరీ ఫణీంద్ర, మళ్ళాయి గూడెం సర్పంచ్ నారాం రాజశేఖర్, మండల నాయకులు జూపల్లి ప్రమోద్, కలపాల శ్రీనివాస్ రావు, కేదార్ నాథ్, నండ్రు రమేశ్, అల్లాడి రామారావు, బాజరయ్య, యుఎస్ ప్రకాష్, హరిక్రిష్ణ, అవుల చిన్ని, గుర్రాల దుర్గయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: