* పోడు భూముల పై గ్రామసభ
* వ్యక్తిగత ,ఉమ్మడి హక్కుల పైన దరఖాస్తులు చేసుకోవాలని కోరిన సర్పంచి..
*హక్కు పత్రాలు అందరికి ఇవ్వాలని అధికారులకు సూచన
మన్యం మనుగడ అక్టోబర్ 1 వెంకటాపురం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు జారీ చేయాలని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించడం జరుగుతోంది. శనివారం బర్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం నందు సర్పంచి కొర్శా నర్సింహమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ గ్రామసభ లో అన్ని గ్రామాలకి చెందిన పోడు సాగుదారులు, ఫారెస్ట్ అధికాని విజయలక్ష్మి పాల్గొనడం జరిగింది. పోడు సాగు దారులందరికి హక్కు పత్రాలు జారి చేయాలని సర్పంచి నర్సింహమూర్తి అధికారులకు సూచించడం జరిగింది. అటవీ హక్కుల కమిటీకి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నారు. పెసా గ్రామసభ తీర్మానాలను కూడా ప్రమాణాలు గా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ,సామూహిక దరఖాస్తులు చేసుకోవాలని పోడు సాగుదారులకు సర్పంచి తెలియజేయడం జరిగింది. అడవిలో ఉన్న వనరుల పైన ఉమ్మడి హక్కులు, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు అడవితో ముడి పడి ఉంటాయి కనుక సామాజిక అవసరాల కోసం చట్టంలో చెప్పిన విధంగా కొంత అడవిని కేటాయించాలి అన్నారు. ప్రభుత్వం తెచ్చిన 140 జీవో అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిచేది గా ఉందన్నారు. డివిజన్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీల్లో అధికారులను పెట్టడం కారణంగా ఆదివాసీల కు హక్కు పత్రాలు రాకుండా చేయడమే అన్నారు. రెవెన్యూ భూమి కలిగిన ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వ కూడదు అనే నిబంధనలు అటవీ హక్కుల చట్టంలో లేవన్నారు. చట్టం ప్రకారం 10 ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఆదివాసీల కు రెవెన్యూ భూములు ఉన్నా మెట్ట భూములే కానీ మాగాణి భూములు కావన్నారు. ఛాయా చిత్రాలను మాత్రమే ఆధారంగా చేసుకొని పోడు హక్కుని కాల రాయొద్దన్నారు. సెక్షన్ 12(10) ప్రకారం నేరం అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోడు సాగుదారుల నుండి 3 నెలల వరకు ఫార్మ్ ఏ.,బి.సి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. అటవీ హక్కుల చట్టంలో పొందు పరచిన 13 రకాల హక్కుల గురించి సంబంధిత రేంజ్ అధికారి ఎఫ్.బి.ఓ ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాదర్శి తాటి మౌనిక, చింత సోమరాజు, చిరంజీవి , న్యాయవాది చింత సమయ్య, గొంది హనుమత్ ,ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: