CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కెసిఆర్ సేవలు దేశానికి అవసరం.

Share it:


మన్యం న్యూస్, అక్టోబర్ 5, వాజేడు:                                                           

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఈరోజు నుండి ఇక లేదు, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరును నూతనంగా విజయదశమి రోజున నామకరణం చేశారు. ఈ శుభ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.దేశానికి కెసిఆర్ సేవలు అవసరమని దేశంలో ప్రజలు కోరుతున్నారని ప్రజల నాడి తెలుసుకొని టిఆర్ఎస్ పార్టీనీ బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం ఆవిర్భావం చెందింది. ఈ కార్యక్రమంన్ని ములుగు జిల్లా వాజేడు మండలం, ప్రగళ్లపల్లి గ్రామంలో, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, పూసం నరేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.                   

ఆయన మాట్లాడుతూ భారతదేశానికి బిఆర్ఎస్ పార్టీ సేవలు అందించే దిశగా కెసిఆర్  అధ్యక్షతన తెలంగాణ భవన్ లో  దిశ నిర్దేశం చేశారని,దేశంలో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కెసిఆర్ సేవలు దేశ ప్రజలకు అందించే సామర్థ్యం కలిగిన వారు అని అన్నారు . తెలంగాణ రాష్ట్రం, దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.అనంతరం ఈ కార్యక్రములో ముఖ్య అతిధిగా ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే, నాగజ్యోతి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి పార్టీ అవిర్భావం చేసినందునా తెలంగాణ రాష్ట్రం ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు.ఇక మా నాయకుడు,.                         

దేశ్ కే నేత అంటూ కెసిఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా బలపరిచేందుకు  ప్రతి రాష్ట్రంలో రాజకీయ నిర్మాణాలు చేస్తానని దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు.భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు దేశంలో పలు రాష్ట్రాలలో సీనియర్ నాయకులు పార్టీలోకి చేరుతారని సంకేతాలు నిండుగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో సంవత్సర కాలంలో ఎలక్షన్ జరిగితే పోటీ చెయ్యాలని బిఆర్ఎస్ పార్టీ అనుకుంటుందని అన్నారు. ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది.అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌరారపు కొటేశ్వరావు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుర్సం రాంబాబు, డైరెక్టర్ పాయం శంకర్ దయాల్, వార్డ్ మెంబెర్స్ బోదేబోయిన మోహనరావు పాయం కృష్ణ కార్యకర్తలు జగదీష్, భాను, సుమంత్, సన్నీ, వంశీ మనోజ్, చందర్ , వినోద్, ,మన్దీప్, హిమము, బిక్షపతి, అక్షయ్, జయంత్ , శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: