CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

Share it:

 


  • ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..
  • గంగమ్మ ఒడిలోకి చేరిన బతుకమ్మ..
  • తీరొక్క పూలతో, తీరైన పాటలతో, చప్పట్ల మోతలతో, తెలుగింటి ఆడపడుచుల ఆటపాటలు..
  • తెలంగాణ సంస్కృతి, సౌందర్యానికి, విలక్షణకు ప్రతీక బతుకమ్మ పండుగ..


జూలూరుపాడు, అక్టోబర్ 3, (మన్యం న్యూస్ ప్రతినిధి) : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక "బతుకమ్మ పండుగ" ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలను పెడతారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానె బియ్యం బతుకమ్మ, 5వఫ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ, ఇక ఆఖరి రోజైన 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం ఎస్టీ కాలనీలో సోమవారం మహిళలంతా అనేక రకాల రంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి, చిన్నగా పసుపుతో గౌరమ్మను తయారుచేసి,పూజించారు. అనంతరం తీరొక్క పాటలతో, తీరైన ఆటలతో, మహిళలంతా ఆడి, పాడి ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం "పోయిరా బతుకమ్మ మళ్లీ రావమ్మా" అంటూ గంగమ్మ వాడికి చేర్చారు. తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలు అన్ని సామాజిక కుటుంబ సంబంధాలకు అద్దం పడతాయి. ప్రకృతిని ఆత్మీయంగా పెన వేసుకుంటాయి. అట్లాంటి పండుగల్లో బతుకమ్మ  ఒకటి బతుకమ్మ సహజ సౌందర్యానికి ప్రతీకైన పండుగ, ఇందులో పేర్చే వన్ని అడవిలో పూసే అందమైన పూలే, ఈ పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలం ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ప్రకృతి అందాలు, పండుగ సంబరాలు, తెలంగాణ ఆడపడుచుల ఆనందాలతో పల్లెలన్నీ మెరిసి మురిసిపోతున్నాయి.

Share it:

Post A Comment: