CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మధుర జ్ఞాపకాలు మరువలేనివి సొంత ఊర్లో దసరా ఉత్సవాలకు హాజరైన భద్రాద్రి కలెక్టర్ అనుదీప్.

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 06.. మాతృ భూమి పై మమకారంతో పుట్టిన ఊరు లో ప్రజలతో పంచుకున్న మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ మరచిపోలేని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు , గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విజయదశమి ఉత్సవాల్లో పాల్గొనడానికి తన స్వగ్రామం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ కు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.

ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా తన మాతృభూమిపై మమకారంతో పుట్టిన ఊరికి విచ్చేసి తన బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి సరదాగా గడిపారు ఈ సందర్భంగా గ్రామంలో యువకులు, విద్యార్థులు, నాయకులు కలెక్టర్ అనుదీప్ ను ఘనంగా సన్మానించారు. మారుమూల పల్లె నుంచి తమ బిడ్డ ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు మాకు గర్వంగా ఉందని గ్రామస్థులు కొనియాడారు. ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో అద్భుతమైన పనితీరుతో ఒక్క ప్రాణ నష్టం లేకుండా విధుల నిర్వహణ చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ చేత మన్ననలు, ప్రసంసలు పొందడం అలాగే స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ పురస్కారాల్లో దేశంలో 750 జిల్లాల్లో భద్రాద్రి జిల్లాను మూడో స్థానంలో నిలబెట్టి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ చే అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు కలెక్టర్ కు అభినందనలు అందజేశారు.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ సాయికుమార్, ఎంపీటీసీ లక్ష్మీ, సింగిల్  విండో చైర్మన్ మోహన్ రెడ్డి, మైలారం సురేష్, రాజారెడ్డి, శీను, కలెక్టర్ తండ్రి ఏడీఈ మనోహర్, నాయకులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: