CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశ్ కి నేత కెసిఆర్.. బి ఆర్ ఎస్ జిందాబాద్ అపర చాణిక్యుడు అలుపెరగని పరిపాలనాదక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్

Share it:


  •  దేశ్ కి నేత కెసిఆర్.. బి ఆర్ ఎస్ జిందాబాద్
  • అపర చాణిక్యుడు అలుపెరగని పరిపాలనాదక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్
  • బీఆర్ఎస్ వెంటే మేమంతా.. విలేకరుల సమావేశంలో కొత్తగూడెం శాసన సభ్యులు వనమా

మంజు న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08... అపర చాణిక్యుడు, అలుపెరుగని పరిపాలనాదక్షుడు గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని దేశ  స్థాయిలో భారత రాష్ట్ర సమితి గా నామకరణం చేసి చారిత్రాత్మక తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కలుపుకొని ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ఫస్ట్ ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. దేశంలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నియంత పాలన కొనసాగిస్తూ దేశ ప్రజలను ప్రధాని మోడీ  మోసం చేస్తున్నారని అన్నారు. దేశంలో బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ దేశ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని ఒక సుస్థిరమైన స్థానంలో నిలబెట్టి దేశ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందించెం దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఆనందంగా ఉన్నారన్నారు. భారత రాష్ట్ర సమితిని దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తామంతా ఉంటామని శపదం చేశారు. మునుగోడు లో జరగబోయే ఎన్నికల్లో ముమ్మాటికీ టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అందుకు ప్రజాప్రతినిధులు సైతం శక్తివంచన లేకుండా సైనికులుగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రధానమంత్రి అవ్వడం తథ్యమన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జడ్పిటిసి బరపటి వాసుదేవరావు ఎంపీపీలు బాదావత్ శాంతి భూక్యా సోనా, భారతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, యూసుఫ్, శ్రీనగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, ఎం ఏ రజాక్, రాంబాబు, భీమ శ్రీధర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: