CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వికలాంగుడని కూడా చూడకుండా కాలితో తన్నిన సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పళ్ళికొండ యాదగిరి

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ఇటీవల ఒక వికలాంగుడు పైన జరిగిన సంఘటనను మాలమహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి ఖండించారు, ఈ సందర్బంగా పల్లికొండ యాదగిరి మాట్లాడుతూ,మహబూబ్ నగర్ జిల్లా హన్వాడా మండలం పుల్పోని గ్రామం లో చోటు చేసుకున్న దారుణ సంఘటన   వికలాంగుడు కృష్ణయ్య ఉపాధి హామీ పనిలో తనకు రావాల్సిన డబ్బులు గురించి సర్పంచ్ ను అడగ్గా, కోపోద్రేకుడైన సర్పంచ్ బండబూతులు కృష్ణ ను తిడుతూ, మరోపక్క అధికారులను తహసీల్దార్, ఎంపీడీఓ లను సైతం అసభ్య పదజాలంతో దూషిస్తూ, కృష్ణను కాలితో తన్నడం అమానుషం,అమానవీయం అటువంటి దూరహంకారం కలిగిన సర్పంచ్ శ్రీనివాస్ పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, దేశ ప్రధానమంత్రి వరకు అందరూ ప్రజాస్వామ్య దేశంలో సమానమే,ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంటుంది.ప్రజా స్వామ్యం అంటే ప్రజలే నిజమైన పాలకులు, పాలితులు, అటువంటి ప్రజానీకం పై అధికారం మదం తో కన్ను, మిన్ను కానక అధికారం అనే మదంతో, వికలాంగుడైనా కృష్ణయ్య ను కాలుతో తన్నిన సర్పంచ్ శ్రీనివాస్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే అధికారం ఉంది కదా అనే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ ఇష్టా రాజ్యం గా ప్రవర్తిస్తే చట్టం చూస్తూ వూరుకోదని, చట్టం తన పని తాను చేస్తుందని తెలిసి వచ్చేలా, మరల ఇటువంటి సంఘటనలు పునరవృతం కాకుండా ఉండేలా చట్టం ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని పల్లికొండ యాదగిరి తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: