CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Share it:


మన్యం మనుగడ, ఏటూరు నాగారం:

ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ హాజరై ఐటీడీఏ యూనిట్ అధికారులు

సిబ్బంది తో కలిసి మహా త్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ. స్వాతంత్ర పోరాటంలో మహా త్మాగాంధీ కృషి గొప్పదని, గాంధీజీ ఐడియాలజీ అని అన్నారు.1947లో అహింసా యుత పద్ధతిలో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అందుకే ఆయన జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకున్నామని,గాంధీజీ స్వచ్చ్ భారత్ మిషన్ ఐడియాలజీ ఆఫ్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అనుసరించి, ఇటీవల మనము గాంధీజీ  ఆలోచనలను స్మరించుకుంటూ 75వ వజ్రోత్సవాలు జరుపుకున్నామని అన్నారు.

గాంధీజీ తన జీవితంలో అత్యంత పేద, పేదలలో అత్యంత పేద ప్రజలకు సహాయం చేస్తు,సంక్షేమ అభివృద్ధి కోసం తన జీవితాన్ని  కొనసాగించారని అన్నారు. ఐటీడీఏ కార్యాలయాలు కూడా గాంధీజీ ఆదర్శాలు,సూత్రాలను అనుసరిస్తుందని అన్నారు.

ఆదివారం సెలవు దినమైన కూడా అధికారులు,సిబ్బంది అందరూ వేడుకకు హాజరవడం అభినందనీయమని అందుకు అందరికి ధన్యవాదములు అని మనము గాంధీజీ అంచనాలను స్వీకరించడానికి ప్రయత్నిద్దాం అని ఈ సందర్భంగా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంకిత్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు,ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పోచం,ఏవో దామోదర స్వామి,ఎస్ వో రాజ్‌కుమార్,

ఏ ఏ వో సంతోష్, పి హెచ్ ఓ రమణ,భారతి,ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్,అకౌంట్స్ మేనేజర్ నర్సింగ్, ఏఈ అబిద్ ఖాన్, జేడీఎం కొండల్  రావు ఐటీడీఏ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: