CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్య మంత్రి దసరా కానుక గా గ్రామ సేవకుల డిమాండ్లు నెరవేర్చాలి

Share it:


గ్రామ సేవకుల సంఘం, మంగపేట : 

ములుగు జిల్లా మంగపేట మండలంలో గ్రామ సేవకుల నిరవధిక సమ్మె 70 వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న గ్రామ సేవకులు మాట్లాడుతూ గ్రామ సేవకులకు ఆదివారాలు,పండగలు, సెలవులు లేకుండా నిర్విరామంగా 70 వ రోజుల నుండి సమ్మె చేస్తున్నామని, గ్రామ సేవకులు అందరూ మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారని, జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ సమ్మె చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తొందరగా గ్రామ సేవకుల సమస్యల పట్ల స్పందించి ఈ దసరా పండగ రోజు అయినా మాకు సీఎం  తీపి కబురు చెపుతారని ఆశభావం వ్యక్తం చేశారు.

            ఈ కార్యక్రమంలో గ్రామ సేవకుల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు  పాల్గొనడం జరిగినది.

Share it:

TELANGANA

Post A Comment: