CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా రాణి దుర్గావతి జయంతి వేడుకలు..

Share it:


మన్యం న్యూస్ : జూలూరుపాడు, (అక్టోబర్ 5) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో బుధవారం గోండ్వానా రాణి దుర్గావతి జయంతి వేడుకలను జూలూరుపాడు కొమరం భీమ్ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాణి దుర్గావతి 1524 అక్టోబర్ 5, న ఉత్తరప్రదేశ్ లోని బండా లో జన్మించారని, దుర్గావతి బాల్యం నుంచే విలువిద్య, ఫెన్సింగ్, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం సాధించి తన తండ్రితో కలిసి అడవిలో వేటకు వెళ్ళలేదని తెలిపారు. 18 సంవత్సరాల వయసులో వివాహమై భర్త మరణంతో తన ఐదు సంవత్సరాల కుమారుడుతో గోండ్వానా రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. సుల్తాన్ బాజ్ బహదూర్, అక్బర్, అసఫ్ ఖాన్, మొగలులు లాంటి రాజులతో సైతం యుద్ధంలో గెలిచిన ఘనత రాణి దుర్గావతి అని తెలిపారు. అనంతరం 1564 లో తన రాజ్యం పైకి దండెత్తి వచ్చిన మొగలలతో హోరా హోరీగా పోరాడి తీవ్ర గాయాల పాలై మొగలుల చేతిలో మరణించడం ఇష్టం లేక తనను చంపమని తన సైనికుడిని ఆదేశించగా అందుకు సైనికుడు నిరాకరించడంతో, తన నడుము భాగంలో ఉంచుకున్న సురకత్తిని తీసుకొని తనకు తానే ఆత్మార్పణ గావించిన వీరనారి రాణి దుర్గావతి అని ఆమె త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దబోయిన రామ్మూర్తి, సోడే శ్రీరామ్, దొడ్డ అరుణ, బచ్చల లక్ష్మయ్య, మలకం వీరభద్రం, తెల్ల మహేష్,పూనెం రాములు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: