CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు మరియు ట్రోఫీ ను అందజేసిన ఎంఎల్ఎ మెచ్చా

Share it:


మన్యం న్యూస్, దమ్మ పేట: దమ్మపేట మండలం, రాచూరిపల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామస్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆదివారం బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ పోటీల్లో లైగర్ టీం సోయం రాధ కృష్ణ, వాడే వెంకన్న, చాప రాంబాబు, మడకం వెంకటేష్, పూనెం తేజా, వగ్గెల రవి మొదటి బహుమతి సాధించిన సందర్భంగా వారికి అలాగే  రైసింగ్ స్టార్ టీం సున్నం ఉపేందర్, సోయం అరుణ్ పాండే, మడకం అక్షయ్, సోయం చిరంజీవి, సోయం పవన్ కళ్యాణ్,

మోడీయం వెంకన్న బాబు వారు రెండోవ బహుమతి సాధించిన వారికి, అలాగే ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి ట్రోఫీలు మరియు బహుమతులు ఎమ్మెల్యే మెచ్చా అందజేశారు.  ఇటీవల నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కణపరిచిన సోదరీమణులకు సోయం సురేష్ బహుమతులు ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రతి విషయం లో మాకు అండగా ఉంటూ ఉత్సహపరుస్తున్న ఎమ్మెల్యే మెచ్చా అంటూ మెచ్చాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ మండలం లో ప్రతి సంవత్సరం ఎదో ఒక క్రీడా పోటీలు నిర్వహిస్తూ రాచూరుపల్లి గ్రామ యువకులు ఉత్సాహంగా ఉంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నారని ఆ మైదానాల్లో ప్రతి ఒక్కరూ వ్యాయామం చెయ్యడానికి అవకాశం ఉంటుందని, యువకులు కూడా తప్పనిసరిగా గ్రామంలో ఉన్న ప్రతి ఒకరితో రోజు ఒక 30నీ పాటు వ్యాయామం చేపించాలని, ఎందుకంటే వ్యాయామం చెయ్యడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, అలాగే ఎలాంటి సమస్య ఉన్న ప్రతి విషయంలో అండగా వుంటానాని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, అంకత ఉమా మహేశ్వరరావు, ఎంపిటిసి నాయుడు శ్రీను, సర్పంచ్ లు రూప సింగ్, శ్రీను, నాగేంద్ర, తాటి సూరి బాబు, దన్ రాజ్, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, అబ్దుల్ జిన్నా, పండురీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: