CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మైనార్టీ సంక్షేమ పై అధికారులకు చిత్తశుద్ధి ఏదీ..?

Share it:

 


మైనార్టీ సంక్షేమ పై  అధికారులకు చిత్తశుద్ధి ఏదీ..?

వక్ఫ్ బోర్డు స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా

ఏం తమాషా చేస్తున్నారా... ఢిల్లీకి రప్పిస్తా

పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన

జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు షహజాదీ బేగం

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో.. మైనార్టీ సంక్షేమ పై అధికారులతో రివ్యూ

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 07... మైనారిటీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంటే.. ఆ నిధులను ఖర్చు పెట్టడంలో ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు విస్మరించారని, మైనారిటీల సంక్షేమానికి మంచి అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, చిన్నపాటి పనులు కూడా చేయలేక నిర్లక్ష్యం వహిస్తున్న  అధికారులను ఢిల్లీకి రప్పిస్తానని, చర్యలు తప్పవని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు షహజాదీ బేగం స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమం కోసం విడుదల చేసే నిధులు పట్ల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి 15 అంశాల మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టే పలు కార్యక్రమాలపై వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల కోసం ఆయా విభాగాల్లో పని చేసే అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈ సమావేశంలో అధికారులతోపాటు ముస్లిం మైనార్టీల ఆయా కమిటీలకు చెందిన సభ్యులు కూడా హాజరై వారి యొక్క సమస్యలను వివరించారు. జిల్లావ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ స్థలాలన్నీ అన్యాక్రాంతం అవటమే కాకుండా పలు ఆక్రమణకు గురవుతున్న అప్పటి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఖ బరిస్తాన్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన మూడు ఎకరాల  భూమిని కేటాయించినప్పటికీ అధికారులు ఇప్పటి వరకు సర్వే చేపట్టకుండా ముస్లిం మైనార్టీలకు అప్ప చెప్పకుండా ఉన్నారని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఒకవైపు పెద్దపీట వేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పలు సంక్షేమ పథకాలు దరిచేరడం లేదని వివరించారు. జిల్లా వ్యాప్తంగా షాదీ ముబారక్ చెక్కులు నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తున్నటువంటి అధికారులపై తక్షణమే తాను ఢిల్లీలో మైనార్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న కొత్తగూడెం తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముస్లిం మైనార్టీ సభ్యులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని.. మైనార్టీల అంటే అంత చులకనగా చూస్తారా.. మైనారిటీ సంక్షేమం కోసం ఎదురయ్యే సమస్యలను ఎప్పుడూ పరిష్కరిస్తారని తక్షణమే తనకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని లేదంటే ఢిల్లీకి రావాల్సి వస్తుంది అని మైనార్టీ కమిషన్ ఎదుట జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలలో ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ పరంగా అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ఆకాంక్ష యాదవ్, డిఆర్ఓ అశోక చక్రవర్తి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, మైనార్టీ నాయకులు ఎం ఏ రజాక్, అన్వర్ పాష, ఆరిఫ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: