CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

50 పడకల మాతాశిశు ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం :

ఏటూరునాగారం మండల కేంద్రంలో రూ.7 కోట్ల నిధులతో  నూతనంగా నిర్మించిన 50 పడకల ఆరోగ్యకేంద్రం భవనం,ఉచిత డయాలసిస్ సెంటర్ ను శనివారం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్,ములుగు ఎమ్మెల్యే సీతక్క,ఐటిడిఏ పిఓ అంకిత్ లతో కలిసి రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.వారికి జిల్లా,ఐటిడిఏ అధికార యంత్రాంగం జిల్లా ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సిఎం కేసిఆర్,వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో రాష్ట్రంలో ఆరోగ్య ప్రదాయిని స్వర్ణ యుగం నడుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మహిళా సంరక్షణ,మాతా శిశు సంక్షేమం కోసం 50 పడకల ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఈ ప్రాంతంలో ప్రారంభించడం సంతోషకరమని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ వరదల సమయంలో ఏటూరు నాగారం సందర్శించినప్పుడు ఈ జిల్లా ప్రజా ప్రతినిధులు కోరినట్లుగా ఫైర్ స్టేషన్, మార్కెట్ యార్డ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు,ఆరోగ్య సేవలు ఉచిత డయాలసిస్ సెంటర్ ఏటూరునాగారంలో ప్రారంభించుకోవడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు.జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు మంజూరుచేస్తూ ఏటూరు నాగారం ప్రజల ఆకాంక్ష మేరకు లోతట్టు గ్రామాల ప్రజల సంరక్షణ కోసం గోదావరిపై కరకట్ట నిర్మాణం,జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. రమాదేవి,సిఈఓ ప్రసునరాణి,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య, డిఎం అండ్ హెచ్ఓ అప్పయ్య,డిపిఓ వెంకయ్య,ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత,  జడ్పీ కో ఆప్షన్ మెంబర్ వలియాభీ సలీం, జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: