CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు పొదుమూరు ప్రజల గుండెల్లో గుబులు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.:

క్షణం క్షణం పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ప్రమాద అంచుల్లో చిక్కుకున్నపోదుమూరు గ్రామం. ఈ విషయం మంగపేట తహసీల్దార్ దృష్టికి వినతి పత్రం ఇచ్చిప్రమాదం గురించి వివరించిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఎల్పీ ముత్యాలు, కస్తూరి బాయ్ మహిళా మండలి అధ్యక్షులు కొమరగిరి సామ్రాజ్యం, ఎమ్మార్పియస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ, ఎమ్మార్పియస్ సీనియర్ నాయకులు పాలమాకుల సోమనర్సయ్య మాదిగ, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందచేశారు. పోదుమూరు గ్రామ ప్రజలకు తప్పని అవస్థలు గోదావరి ఉగ్ర రూపం దాలుస్తున్న ప్రతి సారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు  బ్రతుకును ఎల్లదీస్తునారు.కరకట్ట నిర్మిస్తాము, పక్క ఇండ్లు కట్టిస్తాము అని పంట పొలాలు, పాడి,గోదావరి పాలైనవి  మొదటి దశ వచ్చిన వర్షాలకు ఊరు కాళీ చేయించి స్కూల్ లో ఉంచి వారం రోజుల పాటు ఆహారం అందించినారు తప్ప ప్రభుత్వం నుండి వచ్చిన తక్షణ  సహాయం 10 వేల రూపాయలు, బియ్యం, పప్పు లు, ఈ గ్రామంలో ఏ ఒక్క కుటుంబానికి ఇవ్వలేదు.మాకు ఎందుకు ఇవ్వరని అడుగుతే మీ ఇండ్లలోనికి నీళ్లు రాలేదు అని చెప్పుతూ పొంతనలేని సమాధానం చెపుతున్న అధికారులు.నిజం ఏమిటంటే పోదుమూరు ఎస్సి మాల,మాదిగల ఇండ్ల లోనికి నీళ్ల వచ్చినట్లయితే ఊరంతా గోదావరిలో కొట్టుక పోతది కాబట్టి కంటి తడుపు చర్యలు కాకుండా, శాశ్వత పరిస్కారం చూడాలని  ఎల్పీ ముత్యాలు డిమాండ్ చేశారు. వెంటనే పోదుమూరు గ్రామాన్ని కాళీ చేయించి రాబోవు ప్రమాదన్ని కాపాడాలని శాశ్వత పరిస్కారంలోని భాగంగా అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని పోదుమూరు గ్రామాన్ని మొత్తాన్ని పున: నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎల్పీ ముత్యాలు, కొమరగిరి సామ్రాజ్యం,గుగ్గిళ్ల సురేష్, పాలమాకుల సోమార్సయ్య,ఎల్పీ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: