CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు ద్వారా దళితుల జీవితాలలో నూతన వెలుగులు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

Share it:


మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గురువారం సమితి సింగారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు కమటం.రవీంద్ర బాబుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా మంజూరైన హోండా అమేజ్ కారును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, దళితుల జీవితాల్లో వెలుగులు నింపి,భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు అని తెలిపారు.పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా  ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్,లింకేజీ లేకుండా రూ.10 లక్షల రూపాయలను నేరుగా దళితుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు. దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. దళితులు దళిత బందును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు.దళితుల కన్న కలలు నిజమవుతాయని తెలిపారు. దళిత యువకులు వృత్తి,విద్య లో నైపుణ్యం సాధించి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని, ఒకే పద్ధతిలో అందరూ ఒకటే యూనిట్ ఎన్నుకోకుండా వారి వృత్తులలో విజయాలు సాధించినప్పుడు మాత్రమే దళిత బంధు పథకం విజయం సాధిస్తుందని అని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు.ప్రతి పక్ష నాయకుల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని,అభివృద్ధి సంక్షేమం కళ్ళ ముందే ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, కార్యదర్శి నవీన్,మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వెన్న అశోక్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు బోశెట్టి.రవి,గుర్రం. సృజన్,రాహుల్ గౌడ్,పార్టీ కార్యకర్తలు,అభిమానులు, సోషల్ మీడియా సభ్యులు, టీఆర్ఎస్వీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: