CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వర్షపు నీటితో ఆదర్శ పాఠశాల ప్రాంగణం.. తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విద్యారులు, ఉపాధ్యాయులు

Share it:

 

  • వర్షపు నీటితో  ఆదర్శ పాఠశాల ప్రాంగణం..
  • తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విద్యారులు, ఉపాధ్యాయులు 
  • అధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన సిపిఐ సహాయ కార్యదర్శి మట్ట నరసింహారావు..


మన్యం టివీ,
దుమ్ముగూడెం::

మండలంలోని పేదన్నల్లబల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆంగ్లా బోధనలో ఆదర్శ పాఠశాలగా నిలిచిన పెదనల్లబల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆదర్శ పాఠశాల లో నేడు వర్షపు వరద నీరు చేరి విద్యాని విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు  ఈ పాఠశాలలో 1 తరగతి నుండి 7 తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చిన్నపాటి వర్షాలు కూడా పాఠశాల చుట్టూ జలమలమై తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు దీనితో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల లోకి వెళ్లాలంటే వరద నీటిలో బురదలో నుండే వెళ్ళవలసి  వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యపై గ్రామపంచాయతీ పాలక వర్గానికి మండల స్థాయి అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్లు పాఠశాల ప్రదానోపాద్యాయూలు కొండయ్య తెలిపారు ఈ సమస్య పరిస్కారం కోసం వర్షపు నీరు నిల్వకుండా కొన్నిసార్లు మోటార్లు ఏర్పాటు చేసి బయటకు తోడేరని పాఠశాల నుండి కాలవ తీసి నీరు బయటకు వెళ్ళేవిదంగా ఏర్పాటు కూడా చేశారని కానీ ఈ ఏర్పాట్లు అన్ని తాత్కాలికంగా ఉపయోగపడ్డాయని ప్రస్తుతం సమస్య మళ్ళీ యధాతదంగా మారిందని వాపోతున్నారు. మండలంలోని మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా భద్రాచలం ఐటిడిఏ పిఓ గౌతమ్ సందర్శించి అప్ గ్రేడ్ చేసిన పాఠశాల ఇది .  భద్రాచలం ఐటీడీఏ పి ఓ ఈ సమస్య పరిష్కరానికి చొరవ చూపాలని విద్యార్థిని తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికయినా పాఠశాల ప్రాంగణం ,పాఠశాల చుట్టూ వర్షపునీరు నిలిచి పోకుండా గ్రావెల్ తో నింపి శాశ్వత పరిస్కారం చూపాలని సిపిఐ  మండల సహాయ కార్యదర్శి మట్టా నరసింహారావు మండల అధికారులను డిమాండ్ చేశారు.


Share it:

TELANGANA

Post A Comment: