CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసరా బాధితులకు పెన్షన్ కార్డులు పంపిణీ ఎమ్మెల్యే, పోదేం వీరయ్య.

Share it:

 


మన్యం మనుగడ /వాజేడు, సెప్టెంబర్ 3:                         తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలలో ఒకటి ఆసరా పెన్షన్ పథకం. ఈ పెన్షన్ ఆధారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత గల పెన్షన్ దారులకు ఉపాధి కల్పనల ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. శనివారం మండలంలో ఆసరా పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ఎంపీపీ శ్యామల శారద వహించారు.వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరికొద్ది రోజులలోనే 2014లో ఆసరా పెన్షన్ పథకాన్ని శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. 200 ఉన్న ఆసరా పెన్షన్ 2000 రూపాయలకు పునరుద్ధరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. నూతనంగా వాజేడు మండలానికి  ఆసరా పెన్షన్స్ 717 వచ్చాయి, మండలంలో మొత్తం ఆసరా పెన్షన్స్ 3586 వచ్చాయి. అర్హత గల వారికి రాకపోతే మీసేవలో అప్లై చేసుకోగలరు అన్నారు. ఆసరా పెన్షన్ దారులకు కార్డులు పంపిణీ చేసేందుకు భద్రాచలం శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే పో దెం వీరయ్య, వచ్చే క్రమంలో అన్యోన్య కారణాల వల్ల సమయపాలన లోపించడంతో సమావేశానికి హాజరైన అర్హత గల ఆసరా పెన్షన్ దారులు నిరాశకు గురయ్యారు. ఆకలి దప్పికతో, అలమటించిపోయారు. ఎట్టకేలకు సారు వచ్చారు. ఆసరా పెన్షన్ దారులకు కార్డు పంపిణీ చేశారు.ఆకలి దప్పికతో ఉన్న ఆసరా పెన్షన్ దారులకు కార్డులు పంపిణీ చేయగానే సంతోషంతో సంబరపడ్డారు.

 ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎంపీడీవో విజయ తహసిల్దార్ గూడూరు లక్ష్మణ్ ,ఎంపీటీసీలు ,సర్పంచ్ ల పోరం అధ్యక్షులు పూసo నరేష్ సర్పంచులు, పెన్షన్ దారులు ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: