CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నులిపురుగులు మాత్రలు వేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలి - సర్పంచ్ సాదు జోత్నాభాయ్

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామ పంచాయితీ పాఠశాలలు వద్ద సర్పంచ్ సాదు జోత్నా భాయ్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాల చిన్నారుల నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వరకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరూ ఈ మాత్రలు వేసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఈ మాత్రల వల్ల అనేమియా (కడుపు నొప్పి), రక్త హీనత, బుద్ధి మాంధ్యం, సోమరితనం, తదితర వ్యాధుల నివారణకు అవకాశం కలుగుతుందని ఆమె  తెలిపారు. కాబట్టి అర్హులైన ప్రతిఒక్కరూ ఈ మాత్రలను మింగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ ప్రజలు ఆరోగ్య దృష్ట్యా ఈరోజు గ్రామపంచాయతీలో ప్రతి వీధికి బ్లీచింగ్ చెల్లించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, సూపరవైజర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్స్  అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: