*మన పథకాలు దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
*కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపహాడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండలం మొరంపల్లి బంజర గ్రామం ఎస్సీ కాలనీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి సుమారు 150 కుటుంబాలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరారు, వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆహ్వానించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుల వివిధ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతున్నదని అన్నారు, ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో వెనకబడిపోతుంది అన్నారు.ప్రస్తుతరణలో సీఎం కేసీఆర్ సేవలు దేశానికి ఎంత అవసరమని ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు రైతు బీమా ఇస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తుంటే కేంద్రం మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ కార్పొరేట్ దాఖానాలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్ది పేదలకు వైద్య సేవలను అందిస్తుందని, కెసిఆర్ కిట్టు ద్వారా మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు అందిస్తున్నారు అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్షాని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటుచేసి విజయవంతంగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతున్నదన్నారు.ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందించాలని సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి రక్షిత మంచినీరు అందిస్తున్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రు.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది అలా అందించిన ప్రభుత్వ సహకారంతో 30 రకాల వివిధ వ్యాపారాలను చేసుకుని జీవితంలో ఎదగాలనే సంకల్పంతో తోడ్పాటు ను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటుందన్నారు, బిజెపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఏంటి సంక్షేమ పథకాల అమలు చేయడం లేదన్నారు బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దు అన్నారు. ప్రధానమంత్రి మోదీ ముస్త పథకాలన్నీ ఎత్తువేయాలని ప్రాణాన్ని తయారు చేస్తున్నారని అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉచితాలు బందు చేయాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహాడు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: