CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చ వెంకటేశ్వర్లు.

Share it:


మన్యం మనుగడ , ఏటూరు నాగారం : 

ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మూడవరోజు రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాట్లాడుతూ.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పేర్కొన్నారు.

కేంద్రంలో బిజెపి సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఆర్థిక విధానాలు వేగవంతంగా అమలు చేస్తూ పబ్లిక్ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ ఈ ఐదు సంవత్సరాలు కాలంలో ఐదు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి ఎర్ర కార్పెట్ వేసి పెట్టుబడుదారులను పెంచి పోషిస్తున్నదని దీనికి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు,కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి దేశవ్యాప్త సమ్మె చేసిన ప్రభుత్వం మొండివైఖరిగా ఈ విధానాలు అమలు చేస్తూ దేశంలో మతోన్మాద చర్యలు రెచ్చగొట్టుచు ముస్లింల పైన క్రిస్టియన్ల పైన దళితులపైన గోమాంసం తిన్నారని దాడులు చేస్తూ ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నది.రాష్ట్రంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజాస్వామ్యంగా నియంత్రణ అవలంబిస్తూ ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ తెలంగాణ వాదం పేరుతో పరిపాలన కొనసాగిస్తున్నాడు.తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ నిర్మిస్తారని అప్పుల తెలంగాణగా మార్చినాడు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని ప్రకటించిన క్రింద ఫారెస్ట్ అధికారులు మాత్రం పోడు సోదరులపై దాడులు చేస్తు తప్పుడు కేసులు పెడుతున్నారు.సి పి ఎం పార్టీ కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ తరగతుల ను అధ్యయనం చేసి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి ఎండి దావూద్,దబ్బగట్ల లక్ష్మయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రఘుపతి,తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, వంక రాములు, కావిరి సుధాకర్, గుండు రామస్వామి,ఎండి యాకూబ్,అంకుశావళి, చిటపట రమేష్ వసంత నాగయ్య,బండారి నర్సింహులు,తోలెం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: