CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ సున్నం సరస్వతి, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, సెక్రటరీ అనూష

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో సర్పంచ్ సున్నం సరస్వతి, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, సెక్రటరీ అనూష చేతుల మీదుగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ సున్నం సరస్వతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. గత ప్రభుత్వాలు, నాయకులు తలపెట్టని అనేక అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకువచ్చారని ఆడ బిడ్డలు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఎలాగైతే సారే పెడతారో తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలతో సారే పెడుతోందని చీరలు తీసుకున్న ఆడపడుచులు అంత  చాలా బాగున్నాయి అని హర్షం వ్వక్తం చేశారు అని సర్పంచ్ సున్నం సరస్వతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, రేషన్ డీలర్ శ్రీకాంత్, విఓఏ మామిడి వెంకటమహాలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది పల్లెల సత్యవతి, జగదాంబ, అల్లం కృష్ణవేణి, శ్రీనివాసమ్మ, లాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: