CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ స్థాయి లో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి సమావేశాలు

Share it:


మన్యం మనుగడ, మంగపేట : 

ములుగు జిల్లాలో గ్రామ స్థాయిలో పార్టీ ని బలోపేతం చేసే దిశగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆదేశాల మేరకు మంగపేట మండలం లో గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశాలలో ఉత్సాహం ఉరకలు వేస్తున్న యువత, సుదీర్ఘ అనుభవం గడించిన నాయకులు పాల్గొని తెరాస పార్టీ యొక్క విది విధానాలు, భవిష్యత్ ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించారు.మల్లూరు,నరసింహ సాగర్, బాలన్నగూడెం, చెరుపల్లి,బుచ్చంపేట,నర్సాయి గూడెం,మొదలగు గ్రామల తెరాస గ్రామ కమిటీ సమావేశాలలో 

మల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షులు  ఈశ్వర్,

నరసింహసాగర్ గ్రామ కమిటీ పార్టీ అధ్యక్షుడు

ఉడుగుల శ్రీనివాస్,

 బాలన్న గూడెం గ్రామ కమిటి అధ్యక్షుడు

పోదేం రాంబాబు,

చెరుకుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ,

బుచ్చం పేట గ్రామ కమిటీ అధ్యక్షుడు, బివెంకట్ మల్లు

మంగపేట తెరాస ఇన్ఛార్జి తుమ్మ మల్లారెడ్డి మంగపేట  పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ విస్తృత సమావేశాలు జరిగాయి.

 ఈ సమావేశాలకు మంగపేట మండల ఇన్చార్జి తుమ్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు,

ఈ సందర్భంగా మంగపేట మండలం ఇన్ఛార్జి తుమ్మ మల్లారెడ్డి, మండలం అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ , తెరాస పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు అధ్యక్షులు, పార్టీని బలోపేతం చేసుకుంటూ మన తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతదేశంలోని రైతు సంఘాలు మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలను దేశంలోని రైతులందరికీ అందాలని అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలందరూ మరియు రైతు సంఘాలు ఆలోచిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అందరూ వారికి మద్దతు తెలుపుతూ అండగా నిలవాలని ఈసందర్బంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం కు డా :బి ఆర్ అంబెడ్కర్  పేరు పెట్టినందుకు మల్లూరు గ్రామంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,మల్లూరు గుడి చైర్మన్ నూతల కంటి ముకుందం,పిఏసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,చిట్టిమల్ల సమ్మయ్య, ఆయుబ్ ఖాన్,పూజారి శ్రీనివాస్,చిట్టిబాబు,చల్లగురుగుల తిరుపతి, రాజమల్ల సుకుమార్, బోడ శ్రీను,బోడ ప్రసాద్,గౌని రమేష్,రేసు రమేష్,మంగపేట అధ్యక్షుడు నూనె లింగయ్య,కొత్తమల్లూరు అధ్యక్షుడు సాంబులు తదితరులు పాల్గోన్నారు

Share it:

TELANGANA

Post A Comment: