CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రేస్ సర్వీస్ సొసైటి స్వచ్ఛంద సేవా సంస్థ, విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ.

Share it:

  


మన్యం మనుగడ, వాజేడు, సెప్టెంబర్ 7 : గ్రేస్ సర్వీస్ సొసైటి స్వచ్చంధ సేవా సంస్థ ఖమ్మం వారు, ములుగు జిల్లా వాజేడు  మండలంలోని ప్రగల్లపల్లి, అరగుంటపల్లి, మురుమురు, అరుణాచలపురం, కొప్పుసురు, కొంగాల, గణపురం, పూసురు గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుచున్నా 500 మంది నిరుపేద విద్యార్థిని విద్యార్ధులకు రెండు లక్షల యాబైవేల రూపాయల విలువ చేసే బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, గిఫ్ట్ పాకెట్స్ లను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పూసం నరేష్ కుమార్, యాలం శివరామకృష్ణ, ఉప సర్పంచ్ గౌరరాపు కోటేశ్వరావు, పంచాయతీ కార్యదర్శి చిడేం నరేష్ బాబు,స్కూల్ ప్రదానోపాద్యులు పాల్గొని వారి చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్, నోట్ బుక్స్, పలకలు ఇవ్వడం చాలా సంతోషకరమని ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి, గ్రేస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మారుమూల  గ్రామాలలో పేద పిల్లలకు సాయం చేయడానికి ఇటువంటి  స్వచ్ఛంద సంస్థల ముందుకు రావడం అభినందనీయమని సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్ధ ప్రతినిధులు ముప్పిరి ఆంద్రేయ, కణితి శ్యామ్, మురళీ కృష్ణ రెడ్డి, సైదులు, సతీష్ మరియు  పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: