CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీడీఏ హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, తిరుమల కుంట గ్రామపంచాయతీ పరిధిలోని భద్రాచలం ఐటిడిఏ మరియు వైద్య ఆరోగ్య శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్వో దయానంద స్వామి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని అశ్వరావుపేట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలను కలిగిస్తుందని అలాగే ఈరోజు ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్ నందు సుమారు 56 రకాల పరీక్షలు అన్ని రకాల డాక్టర్లచే నిర్వహించబడుతుందని కావున ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఇవే పరీక్షలను కార్పొరేట్ వైద్యశాలలో చేపించు కుంటే మనకు ఒక వ్యక్తికి కనీసం పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ సంధర్బంగా అయన తెలిపారు. అలాగే అశ్వారావుపేట మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే మెచ్చా దృష్టికి తీసుకెళ్లగా అయన జిల్లా వైద్యాధికారులను వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయమని తెలపడంతో ఈ రోజు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ దయానంద్ ఒక వారం రోజులలో అంబులెన్స్ వస్తుందని తెలపడం నాకు చాలా సంతోషంగా ఉందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ సంధర్భంగా అయన బీపీ హార్ట్ బీట్ జెనరల్ చెకప్ అలాగే కంటి చూపు పరీక్షలు చేపించుకొని వైద్యుల సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ సున్నం సరస్వతి, వైస్ సర్పంచ్ జుజ్జురాపు రాంబాబు, ఎంపిటిసి నాగలక్ష్మి, డిఎంహెచ్ఓ దయానంద్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, సూపర్ డెంట్ శ్రీనివాస్, డాక్టర్స్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: