-ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
-సామాజిక కార్యకర్త కర్నె రవి ఆధ్వర్యంలో నిర్వహణ
-పిల్లలకు బ్యాగులు,బూట్లు,దుప్పట్లు పంపిణీ
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మణుగూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల యందు ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కర్నె రవి ఆర్టిఐ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మణుగూరు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అనాధ విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ మణుగూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థులకు బూట్లు, షూస్ దుప్పట్లు పంపిణీ చేసేటప్పుడు వారి మొహంలో ఆనందం చూడడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. తను మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఉన్నత స్థాయికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు మరో మారు గుర్తు చేశారు. "నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు" అని తెలిపారు. ఈ సందర్భంగా సామజిక కార్యకర్తల కర్నె రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని సుమారు 70 మంది విద్యార్థులకు బూట్లు షూస్ దుప్పట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్, నాగరాజు,CI ముత్యం.రమేష్,MPDO వీరబాబు, విద్యుత్ AD జీవన్, మాజీ ZPTC పాల్వంచ దుర్గా, ప్రభుత్వం డీగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ ప్రయివేటు పాఠశాలలు యాజమాన్యం మొదలగు వారు పాల్గొన్నారు..Good night
Post A Comment: