CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా "పోషణ అభియాన్" శ్రీమంతాలు..

Share it:


జూలూరుపాడు, సెప్టెంబర్ 30, (మన్యం మనుగడ ప్రతినిధి) "పోషణ అభియాన్" కార్యక్రమంలో భాగంగా పోషణ మాస వారోత్సవాలను మండల పరిధిలోని పడమట నర్సాపురం రైతు వేదిక నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంత వేడుకలను జరిపించారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్న ప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. యుక్త వయస్సు బాలికలకు నూట్రిన్ కిట్స్, మానసిక రోగులకు, వయోవృద్ధులకు పోషణ ఆహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహార స్టాల్ ను ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అంగన్వాడి సిడిపిఓ నిర్మల జ్యోతి వివరించారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలు, పిల్లలు, యుక్త వయస్సు బాలికలు, వయోవృద్ధులు పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి భూక్య కళావతి, అంగన్వాడి సూపర్వైజర్లు లక్ష్మి, అరుణ, శకుంతల, రాణి పోషణ అభియాన్ టీం రామబ్రహ్మం, చైల్డ్ లైన్ టీం లలిత అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: