CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ ఉత్సవాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

Share it:

మన్యం మనుగడ, పినపాక :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పినపాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలు, నృత్యాలతో అలరించారు. పాఠశాల ప్రక్కనే పారుతున్న సెలయేటిలో బతుకమ్మను వదిలేశారు. ఉపాధ్యాయ బృందం పిల్లలకు నీటి ప్రవాహం కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మను ఆడుకోవడం సంతోషాన్నిచ్చిందని విద్యార్థినులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామ్ గోపాల్, ఆదినారాయణ, సువర్ణ, గిరిబాబు, నారాయణస్వామి, కిషోర్, శ్రీనివాస్, మురళీకృష్ణ, రమేష్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: