CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ మహాసభలకు పెద్ద ఎత్తున తరలిరావాలి -సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రావులపల్లి

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: వచ్చేనెల 14వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో జరిగే జాతీయ మహాసభలు సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కదిలి రావాలని సిపిఐ కొత్తగూడెం జిల్లా సమితి సహాయ కార్యదర్శి రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మియా జానీ భవన్లో సిపిఐ పార్టీ ఏర్పాటుచేసిన మండల సర్వసభ్య సమావేశం ఆ పార్టీ మండల అధ్యక్షులు జి రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ జాతీయ ప్రఖ్యాతను కాపాడుకునేందుకై బీజేపీ వ్యతిరేక శక్తులతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడం జాతీయ స్థాయిలో జరుగుతుందని ఉమ్మడి కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టిఆర్ఎస్ పార్టీతో జరిగింది అన్నారు. కొందరు తప్పుడు  ప్రచారం చేస్తున్నారని ఆయన సూచించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకై జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక శక్తులతో పొత్తులు పెట్టుకుంటున్నామని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ మహాసభలకు 20 దేశాల నుండి కమ్యూనిస్టు యోధులు ప్రతినిధులుగా వస్తున్నారని వారు అన్నారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారన్నారని ఈ మహాసభలు కమ్యూనిస్టు పార్టీకి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు దీనికి ప్రతి ఒక్క కార్యకర్తను క్షేత్రస్థాయి నుంచి కదిలించి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసిందన్నారు 200 బస్సులతో మహాసభకు ప్రజలను తరలించే పనిలో ఉన్నామన్నారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహాసభలను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 140 జీవో పకడ్బందీగా అమలుచేసి పోడు సాగుదారులందరకు హక్కులు కల్పించాలని ఆ విధమైన పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందు ఉండాలన్నారు, కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే ఈ పోరాటాలను ప్రజలకు అనుగుణమైన విధంగా రూపొందించి పోరాటాల్లోకి తీసుకురావాలన్నారు జిల్లాలో మూడు నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతున్నామన్నారు. కమ్యూనిస్టు పార్టీ అన్ని అనుబంధ సంఘాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీం, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, ఏఐటీయూసీ మండల నాయకులు తిరునాటి సత్యనారాయణ, మహిళా సంఘం నాయకురాలు చీపుర్ల సత్యవతి, తనగాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: